కెసిఆర్ : ఉత్తర తెలంగాణకు సరికొత్త కాటన్ దొర!

ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం ప్రధాన జీవనోపాదిగా ఉన్న ఏ కుటుంబంలోని పెద్దనైనా పలకరించి చూడండి. సర్ ఆర్థర్ కాటన్ దొర అంటే.. తమకు దేవుడు అన్నంతగా భక్తీ ప్రపత్తులను ప్రకటిస్తారు. అందులో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయానికి సుక్షేత్రాలుగా ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే పేరు తెచ్చుకుని ఉన్నాయంటే అది కేవలం కాటన్ పుణ్యమే. అందుకే ఆ జిల్లాల్లో కాటన్ ఫోటోను ఇంట్లో పెట్టుకుని నిత్యం స్మరించుకునే వారు కూడా మనకు కనిపిస్తారు. ఇప్పుడు చూడబోతే ఉత్తర తెలంగాణ కు సంబంధించి కెసిఆర్ కూడా తను కాటన్ దొర కాబోతున్నానని సంకేతాలు ఇస్తున్నారు.

తెలంగాణ సర్కారు విషయంలో వ్యక్తి పూజ ఒకింత ఎక్కువ స్థాయిలోనే ఉన్నదని అందరు గమనిస్తున్న సంగతే. అయితే శనివారం నాడు అది కాస్త శృతి మించిందని కూడా చెప్పాలి. కరీంనగర్ జిల్లా జూలపల్లి గ్రామం నుంచి వచ్చిన రైతులు గోదావరి జలాలని తెచ్చి కెసిఆర్ కు పాదాభిషేకం చేసారు. సారీ, పాదాభిషేకం అంటే పాదాలతో అభిషేకం చేయడం కాదు పాదాలకు అభిషేకం చేయడం అని వారు భావించి అలా ప్రకటించారు. అక్కడితో కెసిఆర్ కు వారు దైవత్వాన్ని ఆపాదించేసారు.

కెసిఆర్ కూడా ఈ కొత్త హోదాను చాల చక్కగా ఎంజాయ్ చేసారని చెప్పాలి. ఉత్తర తెలంగాణ జిల్లాలను గోదావరి జిల్లాల కంటే గొప్పగా తీర్చి దిద్దేస్తానని, ప్రస్తుత బారేజి లతో అది సాధ్యం అవుతుందని కెసిఆర్ అంటున్నారు. ఆచరణ లో అది ఎంతమేరకు సాధ్యం అవుతుందో కాలం మాత్రమే చెప్పగలిగిన సంగతి. అసలే తెలంగాణ సర్కారు లో ప్రతి మంత్రి, ప్రతి వ్యక్తీ పాజిటివ్ గా ఉండే ప్రతి విషయానికి సంబంధించి, క్రెడిట్ ను కెసిఆర్ ఖాతా లో వేయడానికి, కెసిఆర్ ను కీర్తించడానికి ఆరాటపడుతూ ఉంటారు. ప్రస్తుతం కెసిఆర్ ఉత్తర తెలంగాణ రైతాంగానికి తానూ దేవుడిని అనే భావనను కూడా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఈ స్వాతిశయం శృతిమించకుండా నేతలు చూసుకుంటే బాగుంటుంది.

పని చేసి చూపించి అభినందనలు, పూజలు అందుకోవడం అనే పద్ధతి మానేసి..ముందే అరచేతిలో వైకుంఠం చూపించి,ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పనులకి ముందస్తు గానే పబ్లిసిటి చేసుకొని, “ఏదో మంచి జరిగిపోతోంది మన రాష్ట్రానికి” అనే భావన కల్పించడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల సి.యం. లు ఒకరిని మించి ఒకరు పడే తపన ప్రస్తుతం వింత ట్రెండ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close