ఆ పన్నెండు నియోజకవర్గాలపై కేసీఆర్‌కు ఆశల్లేవా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రెండు నెలల కిందట అసెంబ్లీని రద్దు చేసినప్పుడే.. 105 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అప్పట్లో అంతా జిమ్మిక్.. చివరికి వచ్చే సరికి అభ్యర్థుల్ని మారుస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఒక్కర్నీ కూడా మార్చలేదు. అందరికీ బీఫారాలు పంపిణీ చేసేశారు. మధ్యలో మరో ఇద్దరు అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. అందరికీ ఎప్పటికప్పుడు.. ప్రచార సామాగ్రిని పంపుతున్నారు. ప్రచార వ్యూహాల్ని ఖరారు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే… తెలంగాణ భవన్ నుంచే… ప్రచార తీరును… సమీక్షిస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు. కానీ ఆ పన్నెండు నియోజకవర్గాలను మాత్రం… పట్టించుకోవడం లేదు.

ఆ సీట్లపై కేసీఆర్‌కు నమ్మకం లేదా..?

నిజానికి ప్రస్తుత ఎన్నికల పరిస్థితి చూస్తే.. ఒక్క స్థానం కూడా అత్యంత కీలకమే. అలాంటి.. 107 నియోజకవర్గాలపై రెండు నెలల నుంచి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి…పార్టీ యంత్రాంగాన్ని మొత్తం పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్… ఆ పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రం.. అభ్యర్థుల్ని ఖరారు చేయకపోవడానికి కారణం ఏమిటి..? వాటి గురించి పట్టించుకున్న పాపాన పోకపోవడానికి కారణం ఏమిటి..? అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్న వారు అలదడి రేపుతున్నా.. ఎందుకు లైట్ తీసుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఉద్దేశం… కూటమి అభ్యర్థుల కన్నా… టీఆర్ఎస్ అభ్యర్థులెవరో ప్రజలకు క్లారిటీ ఉండాలని.. ఎన్నికల్లోపు వారు రెండు విడతలుగా నియోజకవర్గాన్ని చుట్టేయాలనేది. అదే పని చేస్తున్నారు. ప్రత్యేకంగా వీటిని మాత్రమే దూరం పెట్టడంతో చాలా మందికి … ఈ నియోజకవర్గాలపై కేసీఆర్ ఎందుకు శీతకన్నేశారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

కొన్ని తేల్చుకోలేక… మరికొన్ని బీజేపీ ఖాతాలోకా..?

అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన వాటిలో నాలుగు స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. ఒక బీజేపీ సిట్టింగ్ స్థానం ఉప్పల్‌లో భేతి సుభాష్ రెడ్డి అనే బలహీనమైన అభ్యర్థిని ప్రకటించారు. అక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ కు పని చేసుకోమని ఏడాది కిందటే చెప్పినా.. చివరికి టిక్కెట్ మాత్రం.. సుభాష్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు ఉప్పల్‌లో… టీఆర్ఎస్ రేసులో లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ సిట్టింగ్ స్థానాలైన… ఖైరతాబాద్‌, గోషామహల్‌, అంబర్‌పేటకు అభ్యర్థుల పేర్లను అప్పుడప్పుడూ లీక్ చేస్తున్నారు కానీ.. అధికారికంగా ప్రకటించడం లేదు. అభ్యర్థుల్లేక.. ఇతర పార్టీల నుంచి వస్తారేమో అని ఎదురు చూస్తున్నారన్న కారణం కూడా లేదు. ఎందుకంటే.. ఆయా స్థానాల్లో పోటీ చేయడానికి దానం నాగేందర్ లాంటి బలమైన నేతలే ఉన్నారు. కానీ పెండింగ్‌లో పెడుతున్నారు.

చివరి క్షణంలో ప్రకటిస్తే వెనుకబడిపోరా..?

ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడానికి కారణం.. ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా ప్రచారంలో ముందు ఉండాలనే.. కానీ ఈ పన్నెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులెవరో ఖరారు కాక.. క్యాడర్ అయోమయంలో ఉంది. సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు చురుగ్గా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో లోపాయికారీగా టీఆర్ఎస్ మద్దతు బీజేపీకేనని.. వాళ్ల క్యాడర్ ప్రచారం చేసుకుంటోంది. ఇవే కాదు.. మేడ్చల్‌, మల్కాజ్‌గిరిల్లోనూ.. బీజేపీకి గట్టి అభ్యర్థులే ఉన్నారు.

మల్కాజిగిరిలో ఎమ్మెల్యే రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలైన.. చొప్పదండి , వరంగల్‌ తూర్పు , హుజూర్‌నగర్‌, కోదాడ, వికారాబాద్ విషయం ఏ నిర్ణయమూ తీసుకోలేంత పరిస్థితి లేదు. కానీ కావాలనే… కేసీఆర్ పెండింగ్ లో పెడుతున్నారు. వీటిని లైట్ తీసుకోవాలనే వ్యూహమే కేసీఆర్ అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close