చంద్రబాబు జపం చేశారు కేసీఆర్. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో బయటకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబు జపం చేశారు. కనీసం 40 సార్లు చంద్రబాబును తల్చుకున్నారు. ఆయన తీరు చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మన ప్రత్యర్థి చంద్రబాబేమో అనుకుని ఉంటారు. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ గా లేదు. అయినా సరే ఆయన చంద్రబాబు పాత విషయాలను.. కొత్త విషయాలను గుర్తు చేసుకుని గుక్కపెట్టి ఏడ్చినంత పని చేశారు. తెలంగాణకు ఏం జరిగినా.. కేంద్రం అనుమతులు ఇవ్వకపోయినా చంద్రబాబే అని చెప్పుకున్నారు. ఆయన మళ్లీ రాజకీయంగా బలపడాలంటే చంద్రబాబు తప్ప మరో మార్గం లేదని డిసైడయ్యినట్లుగా ఉన్నారు.
చంద్రబాబును చూసే భయపడుతున్న కేసీఆర్ కు !
కేసీఆర్ చంద్రబాబు జపం చేసిన వైనం చూస్తే.. రాజకీయంగా బలపడాలంటే.. కనీసం ఉనికి నిలుపుకోవాలంటే చంద్రబాబు జపం చేయడం తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ అనుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది. కేసీఆర్ రెండో సారి గెలవడానికి చంద్రబాబే కారణం. మహా కూటమి అని పెట్టి విస్తృతంగా ప్రచారం చేయడంతో .. కేసీఆర్ సెంటిమంటలను రగిల్చి రెండో సారి అధికారం సాధించారు. లేకపోతే 2018లోనే ఓడిపోయి ఉండేవారు. కానీ చంద్రబాబు మూడో సారి అలాంటి తప్పిదం జరగనివ్వలేదు. అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినా సరే చంద్రబాబుకు, రేవంత్ కు ముడిపెట్టి బూచిగా చూపే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు. కర్రు కాల్చి వాత పెట్టారు. ఫలితంగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
కేసీఆర్ను పూర్తిగా మర్చిపోయిన చంద్రబాబు
మరో వైపు చంద్రబాబు పూర్తి స్థాయిలో కేసీఆర్ న మర్చిపోయారు. అసలు ఏ సందర్భంలోనూ వారి ప్రస్తావన తీసుకు రావడం ఎప్పుడూ లేదు. కేసీఆర్ గురించి ఎప్పుడూ చెప్పరు. కేటీఆర్ గురించి చెప్పరు. అసలు బీఆర్ఎస్ అనే మాట ఆయన మాట ఆయన నోటి నుంచి రాదు. వారికి అంత సీన్ లేదనుకుంటారో.. అందరూ మర్చిపోతున్న వారిని ఎందుకు గుర్తు చేయాలని అనుకుంటారో కానీ చంద్రబాబు అసలు పట్టించుకోవడం మానేశారు. వ్యక్తిగతంగా ఆయన ఆస్పత్రిలో చేరినప్పుడు మాత్రం వెళ్లి పరామర్శించారు. రాజకీయంగా మాత్రం గుర్తించడం మానేశారు. తనను పట్టించుకోని చంద్రబాబును టార్గెట్ చేసుకుని కేసీఆర్ మాత్రం లాభపడాలని ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.
కేసీఆర్ రాజకీయ చాణక్యం చంద్రబాబు దగ్గరే సరి !
కేసీఆర్ ను అపర చాణక్యుడంటారు. అదే పనిగా విజయాలు వచ్చినప్పుడు ఈ టైటిల్ వర్తిస్తుంది. కానీ ఓడిపోయాక కూడా ఆయన చాణక్యుడే అనిపించుకోవాలంటే.. ఇలా చంద్రబాబు దగ్గరే ఆగిపోతే ఎవరూ అనరు. రెచ్చగొడితే తప్ప ప్రజాభిమానం పొందలేని రాజకీయ నాయకుడు అనే కేటగిరిలో వేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఓ రాజకీయ నాయకుడ్ని బూచిగా చూపించి తాను గెలవాలనుకోవడం.. బలపడాలనుకునేవారు బలవంతులు ఎందుకవుతారు. బలహీనులు అవుతారు కానీ. అందుకే కేసీఆర్ చాణక్యం అక్కడే ఆగిపోయింది. ఆయన ఎప్పటికీ మరోసారి విజయం సాధించలేకపోవచ్చు.
చంద్రబాబు గురించి కేసీఆర్ వ్యతిరేకతతో ఓ మాట చెబుతూ ఉంటారు.కానీ చంద్రబాబు రాజకీయాలను రాజకీయాల్లాచేస్తారు.కానీ కేసీఆర్ మాత్రం ఆయన చెప్పిన మాటకు సరిగ్గా సరిపోయే రాజకీయం చేస్తారు. ఇలాంటి నేత దేశ రాజకీయాల్లో మరొకరు ఉండరేమో?


