ఇద్దరు నాయుళ్లపై కేసీఆర్‌ అసత్య ప్రచారం!

తన ఎన్నికల బహిరంగ సభ ప్రచారంలో.. కేసీఆర్‌ ఎన్ని చతురోక్తులను అయినా సంధించి ఉండవచ్చు. ప్రత్యర్థుల మీద ఎన్ని సెటైర్లు అయినా వేసి ఉండవచ్చు. చంద్రబాబునాయుడు విషయంలో ఇటీవలి కాలంలో కుదిరిన కొత్త మైత్రీబంధం నేపథ్యంలో కాస్త తమలపాకుతో కొట్టినట్లుగా ఆయన సుతిమెత్తని విమర్శలు చేసి కూడా ఉండవచ్చు. కానీ.. కేసీఆర్‌ ఒక సామాజిక వర్గంపై దురభిప్రాయం ఏర్పడేలాగా, ఇద్దరు నాయకుల మీద తెలంగాణ ప్రజల్లో వైషమ్యాలను పెంచేలాగా కొన్ని అసత్యాలను కూడా ప్రచారం చేశారు.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం జరుగుతున్నది గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ జిల్లాలనుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పగించబడిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాల ప్రస్తావనను కేసీఆర్‌ తన ప్రసంగంలోకి బలవంతంగా తీసుకువచ్చారు. నిజానికి ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రకు వెళ్లడం అనే వ్యవహారానికి, హైదరాబాదు గ్రేటర్‌ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని అందరికీ అనిపిస్తుంది. కానీ.. కేసీఆర్‌ నగరానికి గోదావరి జలాలు తీసుకురావడం అనే పాయింటు దగ్గరినుంచి, గోదావరి జలాలకోసం ఏపీలో పోలవరం నిర్మిస్తున్నారనే పాయింటుమీదకి జంప్‌ అయి, సదరు పోలవరం కోసం మన తెలంగాణ భూభాగాన్ని బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు వద్దకు వచ్చారు. ఈ అంశం గురించి తెలంగాణ ఆవేదనను ఆయన వ్యక్తం చేసి ఉంటే అది వేరే తీరు.. కాకపోతే.. ‘మన ఏడు మండలాలను గుంజుకున్నారు. గుంజుకున్న వాడేమో చంద్రబాబునాయుడు, గుంజిచ్చిన వాడేమో వెంకయ్యనాయుడు.. అలా గుంజుకున్నందుకు వాళ్లకు మనం ఓటేయాల్నా?’ అంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

నిజానికి తెదేపా-భాజపా కూటమికి ఓటు వేయద్దని చెప్పడానికి కేసీఆర్‌ లక్ష కారణాలు చూపించుకోవచ్చు. కానీ.. ఆ ఇద్దరు నాయకులకు ఏమాత్రం సంబంధం లేదని 7 మండలాల వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చి.. వారిద్దరూ కలిసి తెలంగాణ భూభాగాన్ని గుంజుకున్నారంటూ అభివర్ణించడం అనేది చీప్‌ టెక్నిక్‌ అని విశ్లేషకులు భావిస్తున్నారు. 7 మండలాలను ఏపీకి కేటాయించడం అనేది విభజన చట్టంలో భాగంగా గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. చట్టాన్ని అమలు చేయడమే తప్ప.. కొత్త ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. అయితే ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌ ఈ విషయాన్ని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడులకు ఆపాదించి.. వారిమీద బురదచల్లుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close