గెలుపు హోమం చేయించబోతున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. మరో హోమం చేయించబోతున్నారు. తెచ్చి పెట్టుకున్న ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం.. ఆయన ఈ హోమం చేయించబోతున్నారు. మూడు రోజులపాటు హోమాలు చేసే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే కోరికతో గతంలో ఆయన అత్యంత భారీగా అయుత చండీయాగం చేశారు. హోమాలపై.. అత్యంత నమ్మకం చూపే.. కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ యాగం తలపెట్టారు. శంషాబాద్‌ మండలం ముచ్చింతలలోని చినజీయర్‌స్వామి దివ్యసాకేతాశ్రమంలో వేదపండితులతో దీనిపై సంప్రదింపులు జరిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గానీ, చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమంలోగానీ ఈ హోమాల్ని నిర్వహించాలని నిర్ణయించారు.

చండీ హోమం, సుదర్శన హోమంతో పాటు కేసీఆర్‌ జన్మ నక్షత్రానికి సంబంధించిన హోమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. పండితులతో చర్చించి ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో శనివారం చినజీయర్‌స్వామి పుట్టినరోజు మహోత్సవాల్లో శనివారం కేసీఆర్‌ పాల్గొన్నప్పుడు.. హోమం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అక్కడి కోదండ రాముడి ఆలయంలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించి, యాగం జరుగుతున్న చోట కొద్దిసేపు కూర్చున్నారు. ఋత్విక్కులు ఆయనకు కంకణం కట్టి తీర్థప్రసాదాలు అందించారు.

కేసీఆర్‌కు వాస్తు, హోమాలపై అమితమైన నమ్మకం. అసెంబ్లీని కూడా.. ఈ నమ్మకాలతోనే రద్దు చేశారని.. సమయం చూసుకుని… ఎన్నికలు వచ్చేలా చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన వాస్తు బాగోలేదన్న కారణంగా.. సచివాలయాకి … నాలుగున్నరేళ్లలో రెండు, మూడు సార్లు మాత్రమే వెళ్లారు. అదే వాస్తు బాగోలేదన్న కారణంగా.. కొత్తగా ప్రగతి భవన్ నిర్మించారు. ఇప్పుడు హోమానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ పోరాటంలో తీరిక లేకుండా ఉండాల్సిన సమంయలో.. స్వయంగా మూడు రోజుల పాటు హోమంలో కూర్చుకుంటారో.. లేక… ఋత్విక్కులతోనే పని కానిస్తారో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close