మరిన్ని ఆక‌ర్ష‌క ప‌థ‌కాలు కేసీఆర్ ప్ర‌క‌టిస్తారా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా జాతీయ రాజ‌కీయాల‌పైనే దృష్టి పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవలే త‌మిళ‌నాడు వెళ్లొచ్చారు. తెరాస ప్లీన‌రీలో కూడా ఎక్కువ‌గా ఇదే అంశ‌మై మాట్లాడారు. ఫ్రెంట్ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల గురించి ఈ మ‌ధ్య ఆయ‌న మాట్లాడుతున్న‌ది తక్కువే. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ హ‌డావుడి పెంచింది. వ‌రుస‌గా ప్ర‌ముఖ నేత‌ల్ని చేర్చుకుంటూ, ఇత‌ర పార్టీల‌నూ సంఘాల‌నూ క‌లుపుతూ తెరాస‌పై పోరాటానికి సై అంటోంది. ఇంకోప‌క్క‌, తెలంగాణ జ‌న స‌మితి అంటూ కోదండ‌రామ్ కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఆవిర్భావ స‌భ‌కు బాగానే స్పంద‌న వ‌చ్చింది.

ఎవ‌రొచ్చినా ఏం చేసినా త‌మ అధికారానికి వ‌చ్చే ఇబ్బందేం లేద‌న్న‌ట్టుగా తెరాస వైఖ‌రి క‌నిపించింది. కొత్త పార్టీ వ‌ల్ల త‌మ ఓట్లు చీల‌వ‌ని కొంత‌మంది తెరాస నేత‌లు ధీమాగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే, ఈ వైఖ‌రిలో కొంత మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి కాస్త తీవ్రంగానే ఆలోచిస్తున్నార‌ట‌! ఎన్నిక‌లకు ఏడాదే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, మ‌రికొద్ది రోజుల్లో మ‌రిన్ని జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. రైతులకు వ్య‌వ‌సాయ పెట్టుబ‌డిగా సొమ్ము ఇచ్చే కార్య‌క్ర‌మం త్వ‌ర‌లోనే ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, మ‌రి కొన్ని ప‌థ‌కాల‌ను డిజైన్ చేసి, ద‌శ‌ల‌వారీగా ఒక్కో ప‌థ‌కాన్నీ ప్ర‌వేశ‌పెట్టాల‌నీ, త‌ద్వారా ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ కావాల‌నే ఉద్దేశంతో ఉన్నార‌ని స‌మాచారం.

నిజానికి, ఇప్ప‌టికే గొర్రెల పెంప‌కం, వృత్తుల వారికి సాయం అంటూ చాలా జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. వీటిపై విప‌క్షాలు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా… ల‌బ్ధిదారుల నుంచి మంచి స్పంద‌నే ఉంది. కాబ‌ట్టి, ఇలాంటివే మ‌రికొన్ని డిజైన్ చేయ‌డం ద్వారా, ప్ర‌జ‌ల్లో ఉన్న సంతృప్తిని ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగించాల‌ని అనుకుంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో నిర్మిత‌మౌతున్న వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు. చేసిన‌వి ప్ర‌చారం చేసుకోవ‌డం, కొత్త ఆక‌ర్ష‌క ప‌థకాలు ప్ర‌వేశ‌పెట్ట‌డంపైనే తెరాస శ్ర‌ద్ధ పెట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close