కేసీఆర్ కొత్తఆలోచన:150 అంతస్తులతో ‘తెలంగాణటవర్’

హైదరాబాద్: దుబాయ్‌లోని 163 అంతస్తుల బుర్జ్ ఖలీఫా, చైనాలోని 128 అంతస్తుల షాంఘై టవర్స్ స్థాయిలలో హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ తీరంలో 150 అంతస్తులతో తెలంగాణ సిగ్నేచర్ పేరుతో ఎత్తయిన టవర్‌లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. తెలంగాణకు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఒక ప్రత్యేకత ఉండాలని, అందుకే దేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్‌లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని కేసీఆర్ యోచన. ఇదికాక సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట ఎయిర్ బేస్ వరకు 11 కిలోమీటర్లమేర రు.1,000 కోట్ల వ్యయంతో, బాలానగర్ నుంచి నర్సాపూర్ రోడ్డును అనుసంధానిస్తూ రు.700 కోట్లతో మరో కారిడార్ కూడా నిర్మించనున్నారు.

సిగ్నేచర్ టవర్‌ను హుస్సేన్ సాగర్ తీర్ంలో లుంబిని పార్క్, బోట్ క్లబ్, టూరిజం ఆఫీస్ ఉన్న ప్రాంతంలో నిర్మించేందుకు ప్రాధమికంగా ప్రణాళికనుకూడా సిద్ధంచేశారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా దీన్ని నిర్మించాలని, భారతదేశానికి ఒక బహుమానంగా అందించాలని కేసీఆర్ సంకల్పించారు. దీనిపై ఆయన గురువారం మూడుగంటలపాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. తన కార్యాలయంలోని అటెండర్ ఎల్లయ్య మొదలుకొని సీఎస్ రాజీవ్ శర్మ వరకు ఉద్యోగులందరినీ పేరుపేరునా పిలిచి దీనిపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. సీఎల్ ఆలోచనను అందరూ స్వాగతించారు(స్వాగతించక చస్తారా…!). ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు – కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి ఈ టవర్స్‌లో 150 అంతస్తులు పెట్టమని సూచించారట.

ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, కరవు పరిస్థితులతో రాష్ట్రం అల్లాడుతుంటే కేసీఆర్ డాబుకు పోయి ఈ భారీ కట్టడాల నిర్మాణం చేపట్టటం చూస్తుంటే ఆయన తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని చెప్పక తప్పదు. గతంలోకూడా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తానని కేసీఆర్ ప్రకటించారు. పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు ఆ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అటు కోర్ట్ కూడా ఆ ప్రతిపాదనను అడ్డకుంది. దీంతో ఆ సమస్యలను న్యాయపరంగా తొలగించి ప్రతిష్ఠాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టాలని సీఎమ్ ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ వార్త ‘సాక్షి’ పేపర్‌లో తప్పితే టీఆర్ఎస్ పార్టీ పత్రిక అయిన ‘నమస్తే తెలంగాణ’ సహా ఏ ఇతర పత్రికలోనూ రాకపోవటం విశేషం. టీఆర్ఎస్ ఎంపీ కవిత సాక్షి మీడియా ఛైర్ పర్సన్ భారతిని కలిసిన మరుసటిరోజే ఈ వార్త సాక్షిలో వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

మారువేషంలో జగన్ దగ్గరే జడ్జిలపై దూషణల కేసు నిందితుడు !

హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో...

నిర్వాసితుల క‌న్నీటికి స‌మాధానం ఉందా…? బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై వైర‌ల‌వుతోన్న పోస్ట్!

మా క‌న్నీటికి నీ ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? మ‌మ్మ‌ల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెల‌వ‌గ‌ల‌వా...? బ‌త‌కొచ్చినంత మాత్రాన నువ్వు లోక‌ల్ ఎట్లా అయిత‌వ్...? ఇలాంటి ప‌దునైన మాట‌ల‌తో మెద‌క్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close