క్యాడర్‌కు పదవులు సిద్ధం చేసిన కేసీఆర్..!

అనుభవమైతేనే కానీ తత్వం బోధపడదన్నట్లుగా వరుస ఓటములతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు విషయం అర్థమయింది. తన వైపు నుంచి జరిగిన లోపాలేంటో గుర్తించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అలాంటి లోపాల్లో ఒకటి క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తి. క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ఇప్పుడు కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల పంపకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్‌లో నేతలు చాలా ఎక్కువగా ఉన్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే కాకుండా… ఓ రకంగా అధికార దర్పం ప్రదర్శించి కూడా పార్టీలో చేర్చుకున్నారు. అయితే అలాంటి వారిలో అత్యధికులు ఏ పదవీ లేకుండా ఖాళీగాఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో నేతల్లో అసంతృప్తి గూడుకట్టుకుపోయింది. దుబ్బాక,గ్రేటర్‌లో ఓటమికి ఇది కూడా ఓ కారణం అని కేసీఆర్ అంచనాకు వచ్చారు.

కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు తమను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం, ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతోనే కేడర్ లో అసంతృప్తి రాజుకుందని భావిస్తున్నారు ముఖ్య నేతలు. దీంతో కేడర్ ను దగ్గరకు తీసుకుని వారితో ఏర్పడ్డ గ్యాప్ ను పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా, నియోజక వర్గ స్థాయి నేతలకు నిత్యం కలుసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇటీవల కేసీఆర్ తనను కలిసేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నారు. అడిగితే అపాయింట్‌మెంటే ఇవ్వని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ను కలుస్తున్న వారిలో అత్యధికులు పదవుల విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పనిసరిగా పదవులు వస్తాయని తొందరపడవద్దని అందరికీ కేటీఆర్ చెబుతున్నారు.

బీజేపీ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పదవుల కోసం ఎదురు చూస్తోన్న వారు అసంతృప్తితో పార్టీ వీడకుండా టిఆర్ఎస్ చీఫ్ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆశావహుల జాబితా ని ప్రగతిభవన్ ఇప్పటికే సిద్దం చేసిందని పార్టీ లో చర్చ జోరందుకుంది. అటు ఎమ్మెల్యేలు బుజ్జగించడం,ఇటు పదవులు భర్తీ చేస్తారన్న ప్రచారంతో ఆశవహులంతా తమకు పదవులు వస్తాయని టీఆర్ఎస్ క్యాడర్ ఆశల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close