చైనా టూర్‌నుంచి మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదిరోజుల చైనా పర్యటన ముగించుకుని ఛార్టర్డ్ ఫ్లైట్‌లో బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంనుంచి నేరుగా సమీపంలోనే ఉన్న చినజియర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్ వెళ్ళారు. అక్కడ జరుగుతున్న ‘మై హోమ్’ రామేశ్వరరావు షష్టిపూర్తి వేడుకలలో సీఎమ్ పాల్గొన్నారు. రాత్రి పొద్దు పోయినదాకా అక్కడే ఉన్న కేసీఆర్, తర్వాత సిటీలోని ఇంటికి వెళ్ళారు. గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఫార్మ్‌హౌస్‌కు చేరుకున్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదతరులు అక్కడకే వెళ్ళి సీఎమ్‌తో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి రోజుల తరబడి ఫార్మ్‌హౌస్‌లోనే ఉంటున్నారని, పరిపాలనను పట్టించుకోవటంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కేసీఆర్ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతున్నట్లు కనబడుతోంది. సచివాలయానికైతే అమావాస్యకో, పౌర్ణమికో ఒకసారి వెళుతున్నారు. పదిరోజుల తర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, ఈ పదిరోజుల పాలనా వ్యవహారాలను, రైతుల ఆత్మహత్యలను, రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను, ముఖ్య సంఘటనలను ఒకసారి సమీక్షిస్తే బాగుండేది. కనీసం చైనాపర్యటన వివరాలను, ఆ పర్యటనద్వారా ఏర్పడిన ప్రయోజనాలను మీడియాకు తెలియజేయాల్సింది. అలాంటిదేమీ లేకుండా ఫార్మ్‌హౌస్‌కు వెళ్ళి సేదతీరటం విమర్శలకు తావిచ్చేలా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి చైనా పర్యటనకైన ఖర్చు లెక్కలు చెప్పాలని మధుయాష్కీ గౌడ్, షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close