ప్రొ.జయశంకర్‌కంటే కాకా వెంకటస్వామి లక్కీ: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. ట్యాంక్‍‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం పక్కన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నేతలు డీఎస్, కేశవరావు, వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్, అల్లుడు, మరో కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శంకరరావుకూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు స్మరించుకున్నారు. తెలంగాణ రావటానికి తీవ్రకృషి చేసిన పెద్దలు జయశంకర్, యాదగిరిరెడ్డి వంటివారు దురదృష్టవశాత్తూ రాష్ట్రం ఏర్పడకముందే చనిపోయారని, అయితే కాకా వెంకటస్వామిమాత్రం తెలంగాణను చూసే కన్నుమూశారని, ఆయన అదృష్టవంతుడని కేసీఆర్ అన్నారు. చిన్నస్థాయినుంచి అత్యున్నత స్థాయికి మనిషి ఎదగగలడనటానికి వెంకటస్వామి జీవితం నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో అత్యున్నతస్థాయికి చేరుకున్న దళితనేత వెంకటస్వామి అన్నారు.

మరోవైపు వివేక్, వినోద్ కేసీఆర్‌కు దగ్గరవటం చూస్తుంటే వారు మళ్ళీ కారు ఎక్కబోతున్నారా అని ఊహాగానాలు సాగుతున్నాయి. వారు వాస్తవానికి మూడేళ్ళక్రితం టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ, ఎన్నికలముందు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలాఉంటే, అంబేద్కర్ విగ్రహం పక్కన వెంకటస్వామి విగ్రహాన్ని పెట్టటాన్ని నిరసిస్తూ తెలంగాణ ఎమ్ఆర్‌పీఎస్ నేతలు ఆందోళనకు దిగటంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ బృందం వెళ్ళిపోయాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రదేశానికి చేరుకుని కాకా విగ్రహానికి నివాళులర్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close