వడ్ల సమస్య తీర్చేసిన కేసీఆర్ !

వడ్లను కొంటారా లేదా అని కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన సీఎం కేసీఆర్ చివరికి తామే కొంటామని ప్రకటించారు. కేంద్రం తమ మాటకే కట్టుబడి ఉండటం… బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ సర్కార్ రాసిచ్చిన లేఖలను బయట పెట్టడంతో మధ్యలో రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకున్న కేసీఆర్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. బుధవారం నుంచే కొనుగోళ్లు ప్రారంభమవుతాయన్నారు. కనీస మద్దతు ధరకే కొంటామని ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేబినెట్ భేటీలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీవో నెం 111ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే మొయినాబాద్ వైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఫామ్ ల్యాండ్స్ మాత్రమే అమ్ముకోవడానికి చాన్స్ ఉంది. ఇప్పుడు ఏ ఆటంకాలు ఉండవు అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఫార్మా యూనివర్శిటీ ఏర్పాటు.. చెన్నూరుకు తాగునీరు ప్రాజెక్ట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండో రన్ వే వంటి వాటిపైనా నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఎప్పట‌్లాగే బీజేపీపై విరుచుకుపడ్డారు. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో కూర్చొని ఉందని… ఏడాది పాటు రైతులు ధర్నాలు చేస్తే వారిని తూలనాడి చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. నూకలు తినే అలవాటు చేసుకోవాలని కేంద్రం చెప్పి అవమామించిందన్నారు. కేంద్రానికి పాలన చేతక కాక ఇలాంటి వంకలు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తాము పెంచలేదని కేంద్రం పెంచుతోందన్నారు. అదానీకి పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి ఇవ్వడానికి మాత్రం మోదీ ప్రభుత్వానికి చేతకాదని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం చాలా రంగాల్లో కుంగిపోయిందని ..ఏదైనా వస్తే లేనిపోని మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో శ్రీరామ నవమి సందర్భంగా రెచ్చగొట్టే పనులు చేశారని ఆరోపించారు ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకుపోతే కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో కరెంట ్సమస్య లేదని 5600 మెగా వాట్స్‌ 2023లో మనకు అందుబాటులోకి రాబోతోందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close