బడ్జెట్‌లో న్యాయం జరిగిందని కేసీఆర్ భావిస్తున్నారట..!

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరగలేదని .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఆయన .. .కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమేమి ఇచ్చారో చెబుతూ… ప్రకటన చేయలేదు. కేసీఆర్, హరీష్ రావులు సైలెంట్‌గా ఉన్నారని .. అందుకే తెలంగాణకు అన్యాయం జరగలేదని లాజిక్ తీసుకున్నారు. బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్థిక మంత్రి హరీష్ విమర్శలు చేయటం లేదని బండి సంజయ్ చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ పై రాజకీయ విమర్శలు ఆపి.. సలహాలు సూచనలు ఇవ్వాలని .. ఇతర పార్టీల నేతలకు సూచించారు.

బడ్జెట్‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నిధులు ప్రకటించిందని.. ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో వారాంతాల్లో కేంద్రమంత్రులందర్నీ ఆయా రాష్ట్రాలకు పంపించి.. బడ్జెట్ గురించి చెప్పాలని సూచించారు. అలా తెలంగాణకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చారు. ఆయన బడ్జెట్‌లో విశేషాలను మరోసారి చెప్పారు. అయితే విభజన చట్టం సహా.. ఏ విషయంలోనూ తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వలేదు. దీంతో… ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్ష నేతలు మండి పడుతున్నారు.

కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంటయ్యారు. కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై పరిశీలన జరిపినా… ఎన్ని నిధులు వస్తాయి… వాటితో తెలంగాణ బడ్జెట్‌ను ఎలా సర్దుబాటు చేసుకోవాలన్నదానిపై సమీక్ష జరిపారు కానీ.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. దీన్నే బీజేపీ నేతలు అలుసుగా తీసుకుంటున్నారు. బడ్జెట్ బాగుందన్న సర్టిఫికెట్‌కు.. ఆ నిశ్మబ్దాన్ని జోడిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు బడ్జెట్‌పై ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close