కేసీఆర్ నాయకత్వంలో కమ్యూనిస్టులు నడుస్తారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మరోసారి ప్రారంభించారు. గతంలో… ఓ సారి కోల్‌కతా నుంచి.. మరోసారి ఒడిషా నుంచి… ఫ్రంట్ ప్రయత్నాలు చేసినప్పటికీ.. పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ సారి మాత్రం… కేరళ నుంచి ప్రారంభిస్తున్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇక అన్ని చోట్లా.. ఆ పార్టీ తన ప్రాభల్యం కోల్పోతూ వస్తోంది. పార్లమెంట్ సీట్ల విషయంలోనూ.. ఎన్ని గెలుచుకుంటారో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత కమ్యూనిస్టులు వచ్చే ఆ కొద్ది పాటి సీట్లు అయినా… సరే.. అత్యంత కీలకమేనన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో…కేసీఆర్.. తన మూడో విడత ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను… కమ్యూనిస్టులతో చర్చల ద్వారానే ప్రారంభిస్తున్నారు.

కేరళ చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో… కేసీఆర్ సమావేశమవుతారు. వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చేది… రాజకీయాలే. దేశ రాజకీయాలు, ఎన్నికల్లో వచ్చే ఫలితాలు, ఆ తర్వాత … ప్రభుత్వ ఏర్పాటులో.. కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా చేయడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నిజానికి కేరళలోని కమ్యూనిస్టులకు… టీఆర్ఎస్‌కు రాజకీయ పరంగా ఒక సారూప్యత ఉంది. ఇద్దరికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయాల్లో.. అటు కేసీఆర్ కానీ.. ఇటు పినరయి విజయన్ కానీ… రెండు పార్టీలకు.,. కేంద్రంలో మద్దతివ్వాలని అనుకోరు. ప్రాంతీయ పార్టీల కూటమినే అధికారంలోకి రావాలని… వారు కోరుకుంటారని రాజకీయవర్గాల అంచనా.

అయితే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలన్నీ.. బీజేపీ కోసమేనన్న చర్చ… గతంలో నడిచింది. ఇప్పుడు.. కూడా దేశ రాజకీయాల్లో అదే అభిప్రాయం ఉంది. నిజంగా… కేసీఆర్ కలిసే రాజకీయ నేతల్లోనూ అదే అభిప్రాయం ఉంటే మాత్రం… ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనాలు లభించకపోవచ్చు. ఎందుకంటే.. కమ్యూనిస్టులు.. ఆరు నూరైనా.. బీజేపీకి మద్దతిచ్చే ప్రయత్నం మాత్రం చేయరు. ఏ ప్రయోజనం లేకపోయినా.. బీజేపీకి అడ్డుకట్ట వేయాడనికైనా… కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో అత్యంత మాటకారి అయిన కేసీఆర్.. తన చాతుర్యంతో… కమ్యూనిస్టులను ఫెడరల్ ఫ్రంట్‌లోకి చేర్చగలిగితే… తాజా రాజకీయాల్లో అది గొప్ప మలుపవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close