“గుణాత్మక మార్పు” ప్రయత్నాల్లో గొప్ప చాన్స్ మిస్సయిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… “దేశ్ కీ నేత” అయ్యేందుకు కొద్ది రోజుల కింద ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేశారు. వ్యవసాయం ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని తలచారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు ప్రారంభించారు. మమతా బెనర్జీ, దేవేగౌడ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, అజిత్ జోగి .. ఇలా ప్రాంతీయ పార్టీల నేతలందర్నీ వెళ్లి కలవడమో.. హైదరాబాద్ కు ఆహ్వానించి చర్చించడమో చేశారు. ఎవరి వద్ద నుంచి సానుకూల స్పందన రాలేదు కానీ..కేసీఆర్ మాత్రం ఆశలు వదులకోలేదు. విధివిధానాలు ఖరారు చేసి.. మరో నెల, రెండు నెలల్లో ఢిల్లీలో కార్యాలయం కూడా తెరవాలనుకుంటున్నారు.

అయితే … తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు సూపర్ బూస్ట్ ఇచ్చే గోల్డెన్ చాన్స్ ను కేసీఆర్ చేజేతులా పోగొట్టుకున్నారు. అదే కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం. బెంగళూరులో జరిగే కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి దాదాపుగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారనుకుంటున్న ప్రాంతీయ పార్టీల నేతలంతా హాజరవుతున్నారు. వీరిలో కేసీఆర్ చర్చలు జరిపిన మమతా బెనర్జీ, అఖిలేష్, స్టాలిన్ సహా అమరావతి వెళ్లి మరీ కలుస్తానని, తన మిత్రుడని చెప్పుకున్న చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. అందరూ కలిసే ఇలాంటి సందర్భం ముందు ముందు ఉండే అవకాశం లేదు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. ఇదే గొప్ప అవకాశంగా భావించి… బెంగళూరు వెళ్లి.. ప్రాంతీయ పార్టీల నేతలందరికీ … తన ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాలు చెప్పి.. గుణాత్మక మార్పు కోసం అందర్నీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ కాంగ్రెస్ బూచి చూపి.. ఈ వేడుకకు కేసీఆర్ డుమ్మాకొట్టారు. ఒక రోజు ముందే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేగౌడలను అభినందించి వచ్చారు.

నిజానికి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరవుతున్న పార్టీలేమీ… ప్రో కాంగ్రెస్ భావజాలంతో ఉన్నవేమీ కాదు. వాటిలో చాలా పార్టీలు… ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో కూడా లేవు. కుమారస్వామి సర్కార్ కాంగ్రెస్ సపోర్ట్‌తో ఏర్పాటవుతుంది కాబట్టి… రాహుల్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. అంతే కానీ…ఆ కార్కక్రమానికి వెళ్తే కాంగ్రెస్‌కు మద్దతిస్తారని ఎవరూ భావించరు కూడా. పైగా పూర్తిగా బీజేపీ వ్యతిరేక భేటీగా ఆ కార్యక్రమం ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగానే రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి కాబట్టి.. ఇందులో పాలు పంచుకోకపోవడం. కేసీఆర్ గోల్డెన్ చాన్స్ మిస్సయినట్లే.. భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close