తెలంగాణ గల్ఫ్‌ను మించిపోయిందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు వెళ్లబోతున్నారు. తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కేసీఆర్ కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇంతా చేస్తే వారికి లభించే జీతం కూడా తక్కువే. పైగా వేధింపులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదని ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉందని కేసీఆర్ చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తిరిగి వచ్చే వారికి తగిన శిక్షణ ఇప్పించి… రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి గల్ఫ్ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే గల్ఫ్‌లో పరిస్థితులు బాగోలేక తిరిగి వచ్చే వారికి ఇక్కడ ఉపాధి దొరకడం కష్టం ఉంది. వచ్చిన వారందరికీ ఉపాధి కల్పించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. మరి కేసీఆర్ వ్యూహమేంటో అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close