కేసీఆర్ పూజ‌లు కోర్టుకు వెళ్తాయా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మ‌ధ్య‌నే తిరుప‌తి వెళ్లొచ్చారు. కోట్ల రూపాయాల కానుక‌ల్ని వేంక‌టేశ్వ‌రునికి స‌మ‌ర్పించారు. ఎప్పుడో తెలంగాణ ఏర్పడ‌క ముందు పెట్టుకున్న మొక్కుల్ని తీర్చుకున్నారు! గ‌తంలో కూడా కొన్ని దేవాల‌యాలకు వెళ్లారు, భారీ ఎత్తున బంగారు న‌గ‌లు ఆయా దేవాతామూర్తుల‌కు స‌మ‌ర్పించి మొక్క‌లు చెల్లించుకున్నారు. అయితే… కేసీఆర్ గుళ్లూ గోపురాల చుట్టూ తిర‌గ‌డం స‌మ‌స్య కాదు! ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌క్తి విశ్వాసాలు ఆయ‌న‌కు ఉండొచ్చు. వాటిని ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌డం లేరు. కానీ, ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ చేస్తున్న ఈ త‌ర‌హా ఖ‌ర్చుల‌పైనే అంద‌రీ దృష్టీ ప‌డుతోంది. త‌న సొంత మొక్కుల చెల్లింపుల కోసం ప్ర‌భుత్వ ఖాతాలోని సొమ్మును ఖ‌ర్చు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌రైంది..? ఈ వ్య‌వ‌హారం హైకోర్టుకు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొక్కుల ఖ‌ర్చుల‌పై న్యాయ‌స్థానానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధ‌మౌతోంద‌ని తెలుస్తోంది. సొంత మొక్కుల కోసం ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చుచేయ‌డం స‌రికాదంటూ విమ‌ర్శిస్తున్నారు మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. కామ‌న్ గుడ్ ఫండ్ పేరుతో నిధుల్ని సొంత మొక్కుల కోస‌మో, దేవాల‌యాల‌కు కానుక‌లుగా ఇచ్చేందుకు వాడుకోవ‌డం చ‌ట్ట విరుద్ధం అవుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు, దేవాదాయ శాఖ చ‌ట్టం సెక్ష‌న్‌-70 ప్ర‌కారం ఇలాంటి ఖ‌ర్చులు చెల్ల‌వ‌నీ ఆయ‌న వివ‌రించారు. ఇదే విష‌య‌మై హైకోర్టును ఆశ్ర‌యించే ఆలోచ‌న‌లో పార్టీ ఉంద‌ని శ‌శిధ‌ర్ రెడ్డి చెప్పారు.

నిజానికి, ఇలాంటి ఇష్యూపై న్యాయ‌స్థానం దృష్టి సారిస్తేనే మంచిది. ఎందుకంటే, ప్రజా ప్రతినిధులు అంటే ప్ర‌జ‌ల సొమ్ముకు కాప‌లాదారులే, అంతేగానీ య‌జ‌మానులు కాదు క‌దా! ఇంకోటీ… కేసీఆర్ మొక్కుల విష‌య‌మే తీసుకుంటే, ఆయ‌న తెలంగాణ సిద్ధించాల‌ని మొక్కుకున్నారా…? లేదా, తెరాస అధికారంలోకి రావాల‌నీ, తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకున్నారా..? జీర్ణావ‌స్థ‌లో ఉన్న దేవాల‌యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే… దాన్ని సాంస్కృతిక ప‌రిర‌క్ష‌ణ అనే యాంగిల్‌లో స‌మ‌ర్థించుకోవ‌చ్చు. అంతేగానీ, ఇలా సొంత మొక్కుల కోసం ప్ర‌జాధ‌నం వాడ‌కం అనేది క‌చ్చితంగా నిల‌దీయాల్సిన అంశ‌మే.

ఇలాంటి ధోర‌ణికి ఎక్క‌డో చోట ఒక చెక్ ప‌డాలి. లేదంటే, ఇవాళ్ల కేసీఆర్ చేస్తున్న‌దే రేప‌టి త‌రాల‌కు అల‌వాటైపోతుంది! అయినా, ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తుల భ‌క్తి విశ్వాసాలు గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కి రాకూడ‌దు. ఎందుకంటే, ఆయ‌న ఒక రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రినీ పాలిస్తుంటారు. రాష్ట్రంలో ఎన్నో మ‌తాల ప్ర‌జ‌లు ఉంటారు. అంద‌రినీ స‌మ‌దృష్టితో చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ ప్ర‌జ‌ల్లో క‌ల‌గాలంటే.. వ్య‌క్తిగ‌త భ‌క్తి విశ్వాసాల‌ను, న‌మ్మ‌కాల‌ను ప్ర‌జ‌ల ముందు ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ్గాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close