వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మారుతున్న కేసీఆర్ మాటలు..!

” దేశంలో ఉన్న కొత్త చట్టాలు.. రైతులు తమ పంటల్ని ఎక్కడికైనా వెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొనాల్సిన పని లేదు.” ఈ మాట అన్నది తెలంగాణ సీఎం కేసీఆర్. కొద్ది రోజుల కిందట.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ రైతు.. ఢిల్లీకెళ్లి అమ్ముకోగలడా..? అని హైపిచ్‌లో ప్రశ్నించింది కూడా కేసీఆరే. కానీ.. అది గ్రేటర్ ఎన్నికలకు ముందు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల తర్వాత మాట మారింది. వ్యవసాయ చట్టాలకు పరోక్షంగా అయినా అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వాయిస్ మారుతోంది. రైతులకు మద్దతుగా భారత్ బంద్‌ను అధికారికంగా నిర్వహించిన సీఎం కేసీఆర్.. తర్వాత సైలెంటయ్యారు. భారత్ బంద్ రోజు.. రోడ్డెక్కి ఆందోళన చేసిన కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతలందరూ.. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఒకేసారిమద్దతు తెలిపితే విమర్శలు వస్తాయని అనుకున్నారేమో కానీ.. ఆ చట్టాల వల్ల ఉపయోగం ఉందన్నట్లుగా రైతులకు సలహాలిస్తున్నారు. రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నగదును ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షలో కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయం చేయాల్సిందేనని రైతులపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం.. ఇక అవసరం లేదని తేల్చేసింది. రైతులు.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట వేసుకోవచ్చని కేసీఆర్ ప్రకటించేశారు.

ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా పంటలు కొనుగోలు చేయడం వల్ల ఏడున్నర వేల కోట్లు నష్టపోయిందని అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఈ సారి పంటలు కొన్నదని.. ప్రతీసారి అలాగే చేయడం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ మాటల్లో తేడా చాలా స్పష్టంగా ఉందన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close