కేసీఆర్ ఆయుత చండీయాగం ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?

హైదరాబాద్: ఈ నెల 23 నుంచి 27 వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి రు.20 కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇదంతా కేసీఆర్ పూర్తిగా సొంత ఖర్చుతోనే చేస్తున్నారు. ఈ యాగం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీనిని కవర్ చేసేందుకు జాతీయ మీడియాకూడా ఎర్రవల్లికి రాబోతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగానికి చివరి రోజైన 27న హాజరు కాబోతున్నారు. ఏపీ సీఎమ్ చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌తోపాటు పలువురు గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులుకూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

గతంలో టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ ప్రాంగణం సహా వివిధ ప్రాంతాలలో చండీయాగాలు నిర్వహించిన కేసీఆర్, ఈ సారి ఆయుత చండీయాగంకోసం అనేక ప్రదేశాలు పరిశీలించిన తర్వాత చివరికి తన ఫాం హౌస్‌నే ఎంపిక చేశారు. దీనికోసం 30 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం యాగశాలకే 5 ఎకరాలు కేటాయించారు. ఈ 5 ఎకరాలలో వంద హోమ గుండాలు నిర్మిస్తున్నారు. ఒక్కో గుండం వద్ద 11 మంది రుత్విక్కులు కూర్చుని పారాయణం చేస్తారు. శృంగేరికి చెందిన శ్రీ భారతీ తీర్థ స్వామి పీఠం ఆధ్వర్యంలో యాగం జరుగుతుంది. నిత్య కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, నవగ్రహ జపాలు, మహారుద్ర అభిషేకాలు, ప్రవచనాలు, సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ 30 వేలమందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. యాగంలో ఆవుపాలతో చేసిన అన్నం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించటం ప్రత్యేకత. దాదాపు 12 టన్నుల పాయసాన్ని యజ్ఞగుండాలకు నైవేద్యంగా సమర్పిస్తారు. పాయసంలో ఆవుపాలు, అన్నం, తెల్లనువ్వులు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్‌లను వాడతారు.

ప్రముఖులు రానున్నందున వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళే మార్గంలో కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సుందరంగా నిర్మిస్తున్నారు. దశాబ్దాల కోరిక తెలంగాణ కల సాకారమైనందున ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని, ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతుండగా, సీబీఐ దర్యాప్తు భయంతోనే యాగాన్ని నిర్వహిస్తున్నారని, ఉద్యమనేతగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడుకూడా ఇలాగే మానసిక ధైర్యంకోసం దైవాన్ని నమ్ముకుంటారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close