ఆపరేషన్ హాట్ స్పాట్స్..! కేసీఆర్ కొత్త ప్లాన్..!

తెలంగాణ సర్కార్.. ఈ నెలాఖరు కల్లా కరోనా ఫ్రీ స్టేట్‌గా చేద్దామని కంకణం కట్టుకుంది. దానికి తగ్గట్లుగా పూర్తిగా వైరస్ పైనే దృష్టి పెట్టి అధికార యంత్రాంగం అంతా పని చేస్తోంది. కానీ కొన్ని కొన్ని చోట్ల… అధికారులు చేసిన తప్పుల కారణంగా… సామాజిక వ్యాప్తికి దారి తీసింది. ఇలాంటి వాటిలో ఒకటి సూర్యాపేట. గద్వాల, వికారాబాద్‌లలోనూ వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీసిందనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సమస్య అక్కడ ఉద్భవించిందని భావిస్తున్న తెలంగాణ సర్కార్… దిద్దుబాటుచర్యలు తీసుకుంది. సీఎస్, డీజీపీలను అక్కడ పర్యటించాలని ఆదేశించింది. దీంతో వారు…మొదటగా సూర్యాపేటకు వెళ్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెలికాఫ్టర్ ద్వారా.. అన్ని హాట్ స్పాట్లకు వెళ్లి అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వదిలించే ప్రయత్నం చేయనున్నారు.

సూర్యాపేటలో ఒక్కరి ద్వారానే వైరస్ విపరీతంగా వ్యాపించింది. ఇప్పుడు పట్టణం మొత్తం పాకిపోయింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. అక్కడి డీఎంహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్వహరించడంతో… పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. డీఎంహెచ్‌వోను తొలగించి కొత్త అధికారిని నియమించారు. కరోనా వ్యాప్తి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళనగాఉన్నారు. అంతకంతకూ వ్యాపించడం వల్ల.. తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళనగా ఉన్నారు. అందుకే.. ప్రతీ రోజూ సమీక్షలు చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో పధ్నాలుగు రోజులు క్వారంటైన్ పూర్తయిన వారికి.. ఇరవై రోజుల తర్వాత కూడా పాజిటివ్ కేసులు వస్తూండటంతో… వైరస్ బలంగా మారుతోందని.. కేసీఆర్ అంచనాకు వేశారు. దీంతో.. క్వారంటైన్ గడువును… 28రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఏ ఇతర కార్యక్రమం పెట్టుకోకుండా.. పూర్తి స్థాయిలో కరోనాను అంతం చేయడంపైనే కేసీఆర్ దృష్టి సారించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close