కేసీఆర్‌కు ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిన్నతనంలో ఏకసంథాగ్రాహి(ఒకసారి విన్నది మరిచిపోనివారు) అని ఆయనకు చిన్ననాడు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మ చెప్పారు.  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక దినపత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేసీఆర్‌కు చిన్నప్పటినుంచి తెలుగు భాష అంటే బాగా ఇష్టమని శర్మ తెలిపారు. వ్యాకరణంగురించి రాత్రిళ్ళు వచ్చిమరీ అడిగేవాడని చెప్పారు. చిన్నప్పుడు అందరిలోకీ పొట్టిగా ఉండేవాడని, అందుకే తాను అతనిని ఆత్మీయంగా సొంతకుమారుడిలా చూసుకునేవాడినని తెలిపారు. ఏదో పద్యం అప్పజెప్పకపోతే ఒకసారి చిన్నకర్రతో కొట్టానని, అప్పటినుంచి మరింత పోటీగా చదవటం మొదలుపెట్టాడని చెప్పారు. చిన్న చిన్న పద్యాలుకూడా రాసేవాడని వెల్లడించారు. ఏకపాత్రాభినయం చేసేవాడని, బుర్రకథల్లో కథకుడిగా ఉండేందుకు ఇష్టపడేవాడని తెలిపారు. తుపాకి రాముడు, మాయల పకీరులాంటి వేషాలు వేసేవాడని, అన్ని యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొనేవాడని చెప్పారు. అతను 8వ తరగతి చదివేరోజుల్లో సెల్ఫ్ గవర్నమెంట్ రోజు అందరూ టీచర్‌లవేషం వేస్తానన్నారని, చప్రాసి వేషం వేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే కేసీఆర్ ముందుకొచ్చాడని తెలిపారు. తక్కువ స్థితిని తక్కువ చేయకూడదనే భావన అతనిలో అప్పటినుంచే ఉందని అన్నారు. అందుకే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడని శర్మ చెప్పారు.  తెలంగాణ సంస్కృతిని నిలబెట్టేందుకు కృషి చేస్తున్న చంద్రశేఖరరావు తన విద్యార్థి అని చెప్పుకోవటానికి తనకు గర్వంగా ఉందని శర్మ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close