నితిన్‌కి కీర‌వాణి ‘చెక్‌’

కీర‌వాణి చేతిలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో పాటు మ‌రి కొన్ని సినిమాలున్నాయిప్పుడు. అందులో `చెక్‌` ఒక‌టి. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి చంద్ర‌శేఖర్ ఏలేటి ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా నుంచి కీర‌వాణి త‌ప్పుకున్నారు. అందుకు కార‌ణం.. బ‌డ్జెట్టే అని తెలుస్తోంది. లాక్ డౌన్‌, క‌రోనా గొడ‌వ‌ల కంటే ముందే మొద‌లైన సినిమా ఇది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌రిస్థితులు మారిపోయాయి. బ‌డ్జెట్లు త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది.

కీర‌వాణి ఖ‌రీదైన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఇది వ‌ర‌కు ఇచ్చిన బ‌డ్జెట్ కంటే, ఇప్పుడు కాస్త త‌క్కువ కోడ్ చేసిన‌ట్టు స‌మాచారం. దాంతో… కీర‌వాణి ఈసినిమా నుంచి తప్పుకున్నార‌ని తెలుస్తోంది. కీరవాణి స్థానంలో శ్రీ‌క‌ర్ అగ‌స్తిని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నారు. `కంచ‌ర‌పాలెం` సినిమాతో ఆక‌ట్టుకున్నాడు శ్రీ‌క‌ర్‌. ఆ పాట‌లు న‌చ్చే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ ప్రాజెక్టు అప్ప‌గించాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌క‌ర్‌.. ట్యూన్లు స‌మకూర్చే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. ఈసినిమాలో పాటలు త‌క్కువే అని, కాక‌పోతే రీ రికార్డింగ్ కి మంచి స్కోప్ ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close