బీజేపీలో ఉన్న సీఎం రమేష్ టీడీపీకి షిండే ఎలా అవుతారు !?

తన రాజకీయానికి అడ్డం వస్తున్నారని .. తమ్ముడ్ని టీడీపీ అధినేత ప్రోత్సాహిస్తున్నాడని రగిలిపోతున్న కేశినేని నాని … మీడియాతో చిట్ చాట్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో వచ్చే ఎన్నికల తర్వాత ఎన్టీఆర్‌ నుంచి పార్టీని చంద్రబాబు ఎలా సొంతం చేసుకున్నారో అలాగే చంద్రబాబు నుంచి పార్టీని సిఎం రమేష్‌ లాగేసుకుంటారని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్‌ నాథ్‌ షిండేలా ఏపీలో సిఎం రమేష్‌ టీడీపీని కాషాయంలో కలిపేస్తారని చెప్పినట్లుగా వైసీపీ అనుకూల మీడియా ప్రకటించింది.

చంద్రబాబుకు టీడీపీని గెలిపించే సామర్త్యం లేదని కూడా ఆయన చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన లాంటి నిజాయితీపరుల మాటలు వినరనీ.. కోటరీ మాటలే వింటారని అన్నట్లుగా చెప్పుకున్నారు. పలు వైసీపీ అనుకూల మీడియాలో ఈ కథనాలు వచ్చాయి. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నారు. ఆయన షిండేలా ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఎక్కువ మంది సందేహం.

అయితే ఇదంతాఆయన రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలు.. ఆ తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఉంటుంది. అప్పుడ రాజెవరో బంటెవరో తర్వాత సంగతి.ప్రజాతీర్పు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి.అయితే కేశినేని నాని తన తమ్ముడ్ని కంట్రోల్ చేయలేదన్న కోపం..పైగా ప్రోత్సహిస్తున్నారన్న అనుమానంతో చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి రాజకీయంతో తన కుమార్తె రాజకీయ జీవితాన్ని కూడా ఆయన బలిపెడుతున్నారని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close