ఖైదీనంబర్150…నైంటీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ…అదిరిపోయే ఐడియా

మెగాస్టార్ 150వ సినిమా ఖైదీనంబర్ 150కి సంబంధించిన పబ్లిసిటీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఊరమాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసే రిలీజ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. టీజర్ కూడా సేం టు సేం. తాజాగా రిలీజ్ చేసిన అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్‌కి సంబంధించిన చిరంజీవి స్టిల్ కూడా ఊరమాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసే వదిలారు. దేవిశ్రీ మ్మూజిక్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఆ ఊరమాస్ సినిమా తీయడంలో కూడా బోయపాటి శ్రీనుకు ఉన్నంత కన్విక్షన్ వినాయక్‌కి ఉందా అనే విషయంపై బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి. ఓ పాత కథతో సరైనోడు అంటూ వచ్చి సరైన హిట్ కొట్టిన బోయపాటి శ్రీనులా వినాయక్ కూడా మేజిక్ చేయగలడా?

ఆ విషయం పక్కన పెడితే ఆల్రెడీ రిలీజ్ అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ యాక్టింగ్ విషయం పక్కన పెడితే సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ వర్క్ మాత్రం అదిరిపోయింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్ మూవీని ఆ రేంజ్‌లో తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గౌతమీ పుత్ర కథకు ఉన్న స్పెషాలిటీ, క్రిష్ సూపర్బ్ డైరెక్షన్ దృష్ట్యా అయినా ఆ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నంబర్ 150 సినిమా అవుట్ పుట్‌ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకు ఫస్ట్ డేనే ‘పాతగా ఉంది’ అన్న టాక్ అయితే కచ్చితంగా వచ్చేలా కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150వ సినిమా గురించి అంతర్గతంగా చర్చించుకుంటున్న సినిమావాళ్ళు ఇప్పుడు వినాయక్‌కి ఓ సూపర్బ్ సలహా ఇస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే ఇది నైంటీస్ బ్యాక్ డ్రాప్ సినిమా అని చెప్పేయండి. అప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎలాగూ ఇప్పటి టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు కాబట్టి తొంభైల బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ట్రెండీ సినిమా అయిపోతుంది అని కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టనిపిస్తోంది కదా…..వినాయక్‌కి కూడా రీచ్ అయితే బాగుండు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close