క్రైమ్: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కూతురు..!

కన్నకూతురు దారి తప్పుతోందని గుర్తించి హెచ్చరించడమే ఆ తండ్రి చేసిన తప్పు. జన్మనిచ్చాడనే కనికరం కూడా లేకుండా.. ఉసురు తీసేసింది కూతురు. కృష్ణా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తండ్రినే హత్య చేయడానికి వెనుకాడకపోవడానికి ఆ కూతురు వెనుకాడకపోవడానికి కారణం వివాహేతర సంబంధం. తన రహస్య కార్యకలాపాలను తెలుసుకున్నాడని… అడ్డగిస్తున్నాడని.. హెచ్చరిస్తున్నాడన్న కారణంగా.. తండ్రిని కూడా ప్రియుడితో కలిపి చంపేసిన కూతురు వ్యవహారం … పోలీసులను సైతం ఆశ్యర్యానికి గురి చేసింది.

కృష్ణా జిల్లాకు చెందిన కాజా కృష్ణప్రసాద్ అనే 62 ఏళ్ల వ్యక్తి… జూలై ఒకటో తేదీన.. పరిధిలోని నిమ్మగడ్డ రోడ్డులో అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. పోలీసులు వివరాలు ఆరా తీస్తే… ఆ మృతదేహం…నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన శేషుకుమారి తండ్రిదని తేలింది. పోలీసులు ఆమెను పిలిపిస్తే.. తన తండ్రేనని గుర్తించి బోరున విలపించింది. కృష్ణప్రసాద్ ప్రమాదంలో మరణించలేదని పోలీసులు ప్రాథమికంగానే నిర్ధారించారు. కచ్చితంగా హత్య చేసి తీసుకొచ్చి పడేశారన్న అనుమానాలు వారిలో మొదట్లోనే వచ్చాయి. అందుకే సీరియస్‌గా విచారణ చేశారు. గుట్టు బయటకు లాగారు. ఒకొక్క ఆధారం బయటకు లాగేసరికి… చివరికి అసలు కుట్ర కూతురు శేషుకుమారి వద్దకే చేరింది. పోలీసులు గుట్టు మొత్తం బయటపెట్టారు. దీంతో శేషుకుమారికి నేరం ఒప్పుకోక తప్పలేదు.

కృష్ణప్రసాద్.. కొన్నాళ్లుగా.. కూతురు శేషుకుమారి ఇంటి వద్దే ఉండి ఓ హోటల్‌లో పని చేసుకుంటున్నాడు. శేషుకుమారి భర్త చనిపోయాడు. ఆమె వేముల వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఇది గమనించిన తండ్రి కూతుర్ని హెచ్చరించాడు. దీంతో తండ్రిని అడ్డు తొలగించుకోవాలని.. శేషుకుమారి ఆమె ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఓ రాత్రి ఇద్దరూ కలిసి చంపేసి.. మృతదేహాన్ని దూరంగా పడేసి వచ్చారు. పోలీసులకు మాత్రం తండ్రి వేరే ఊరికి వెళ్లి వస్తారని చెప్పి వెళ్లారని.. సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లడంతో రాకపోయినా… వస్తాడేమోనని ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చింది.

కానీ ఎంత పకడ్బందీగా నేరం చేసినా.. టెక్నాలజీ ఇప్పుడు ఇట్టే పట్టేస్తోంది. పోలీసులు కూడా ఈ కేసును టెక్నాలజీతోనే పట్టేశారు. మృతుడి సెల్‌ఫోన్ టవర్ లొకేషన్లను… పోలీసులు ట్రాక్ చేశారు. ఆ ఫోన్.. ఇంట్లో లేదని.. తేలిపోయింది. అర్థరాత్రిళ్లు కూడా అటూ ఇటూ తిరిగినట్లు కనిపించడంతో.. కూపీ లాగారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, సెల్‌టవర్‌ లొకేషన్‌లు పరిశీలించి చల్లపల్లి పోలీసులు కూతురి కుట్రను బయటపెట్టారు. తండ్రిని చంపిన కూతుర్ని… ఆమె ప్రియుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com