జె&కెలో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణాలో కూడా వచ్చేస్తుందా?

భాజపా ఆవిర్భావోత్సం సందర్భంగా ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ, ప్రధాని నరేంద్ర మోడి కారణంగా మన పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అలాగే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా మనమే అధికారంలోకి వస్తాము. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణా రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒకపక్క దేశద్రోహులతో, సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపి సాగుతూ, జాతీయవాదం, దేశభక్తి గురించి మాట్లాడుతునందుకు మనపై పనిగట్టుకొని చాలా దుష్ప్రచారం చేస్తోంది,” అని అన్నారు.

కిషన్ రెడ్డి దేశభక్తి, దేశద్రోహుల గురించి మాట్లాడుతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం గురించి మాట్లాడటం చాలా పొరపాటు. ఎందుకంటే అక్కడ దేశం నుంచి విడిపోవాలని కోరుకొంటున్న కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతునిస్తున్న పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీతో భాజపా అంటకాగుతూ, అది ఏర్పాటు చేసిన సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ప్రమాణస్వీకారం చేసినవెంటనే పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదులు, వేర్పాటువాదులకి బహిరంగంగానే కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమార్తె మహాబూబా ముఫ్తీ కూడా తండ్రి అడుగు జాడలలోనే నడుస్తానని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఆమెకే భాజపా మద్దతు ఇస్తోందిపుడు. మరి అటువంటి వేర్పాటువాదులతో భాజపా అంటకాగుతూ దేశభక్తి, జాతీయవాదంపై తమకే పేటెంట్ హక్కులున్నట్లు, దేశంలో మరెవరికీ దేశభక్తి లేదన్నట్లు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఊహించని విధంగా భాజపా అధికారంలోకి వచ్చింది కనుక తెలంగాణాలో కూడా వచ్చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2014ఎన్నికల తరువాత నుంచి నిన్న మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలవరకు ఏ ఒక్క ఎన్నికలలో కూడా గెలవలలేక చతికిల పడిన భాజపా వచ్చే ఎన్నికలలో ఏవిధంగా గెలవగలదో, ఏవిధంగా అధికారంలోకి రాగలదో కిషన్ రెడ్డి కాస్త వివరించి ఉండి ఉంటే బాగుండేది. ‘తెలంగాణాలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే భాజపా కాస్త బలంగా ఉంది మరెక్కడా దాని ఉనికే కనబడటం లేదని’ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారంటే తెలంగాణాలో భాజపా పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చును. కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనయినా అది విజయం సాధించి తన సత్తా చాటుకొని ఉండి ఉంటే, కిషన్ రెడ్డి మాటలు కొంచెమయినా నమ్మశక్యంగా ఉండేవి. కానీ తెలంగాణాలో పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషి చేయకుండా, తెరాస ధాటిని తట్టుకోలేక చేతులెత్తేస్తూ వచ్చే ఎన్నికలలో తెలంగాణా భాజపా జెండా రెపరెపలాడుతుందని చెపుతుంటే ఎవరయినా నవ్వకుండా ఉండలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close