గంటలో పడేస్తానని జగన్ అనలేదన్న కొడాలి నాని

హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతానని జగన్ సవాల్ విసరటం వలనే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ జరిపారన్న వాదనను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కొట్టిపారేశారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ గంటలో పడగొతానని ఆ రోజు అనలేదని చెప్పారు. పాత్రికేయులు అడిగితే సమాధానమిస్తూ, 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తే మీడియాకు చెబుతానని, అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గంటసేపు కూడా ఉండనీయనని మాత్రమే జగన్ అన్నట్లు నాని వివరించారు. 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు కూడా జగన్ చెప్పలేదని గుర్తు చేశారు.

జగన్ ఎప్పుడూ రాజీనామా చేయకుండా పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలను ప్రోత్సహించరని నాని చెప్పారు. ముందుగా పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ చెబుతారని, అందుకనే పదవీకాంక్ష ఉన్న ఎమ్మెల్యేలెవరూ తమ పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉండదని నాని అన్నారు. తాను వైసీపీలోకి వెళ్ళిన సమయంలో రాజీనామా చేసే వెళ్ళానని, అప్పట్లో రు.30 కోట్లకు అమ్ముడుపోయానని ఏపీ మంత్రి దేవినేని ఉమా తనపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు టీడీపీవారు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంత డబ్బులు పోసి కొన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళటానికి దేవినేని ఉమా బ్రోకరేజి చేసినట్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆయన తెలంగాణలో ఒకరకంగా, ఏపీలో మరోరకంగా మాట్లాడుతూ డబుల్ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారని ఆరోపించారు. ఎన్‌టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని నాని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close