15 సీట్లు ఇవ్వాల్సిందేనంటున్న కోదండరాం..! రాహుల్ తో భేటీ..!!

రాహుల్ గాంధీతో సమావేశం అయినా తెలంగాణ జన సమితి నేత కోదండరాం.. సీట్ల విషయంలో సంతృప్తి చెందలేదు. రాహుల్ గాంధీతో అరగంటకుపైగా సమావేశం అయిన కోదండరాం.. కాస్తంత నిరాశపూరితంగానే మాట్లాడారు 17 సీట్లు అడిగామని 15 సీట్ల వరకు పోటీ చేయాలనుకుంటున్నామని ప్రకటించారు.టీజేఎస్‌కు క్యాడర్ లేదనడం సరికాదని .. సిట్టింగ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలు అడగడం లేదన్నారు. సీట్లు గెలిచి మేము అనుకున్న మార్పును సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నేను ఎక్కడ పోటీ చేస్తానన్నది అప్రస్తుతం..అనివార్యమైతే పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా కూటమి ఏర్పాటు ఉండాలే తప్ప. వ్యక్తులకు మేలు చేకూరేలా ఉండరాదన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టే వేరే పార్టీగా ముందుకు వచ్చామని.. టీడీపీతో జరిగిన గొడవలను మర్చిపోలేదన్నారు.

కలలుగన్న తెలంగాణ కోసం కాంగ్రెస్‌తో జత కలిశామని.. ఉమ్మడి కార్యాచరణ అమలుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్ణయించామన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం కలిసి పనిచేయాలని రాహుల్‌ కోరారని మీడియాకు తెిలపారు. కూటమి ద్వారా ప్రజల్లో మార్పు తేవాలని రాహుల్‌ ఆశిస్తున్నాన్నారు. కూటమి ఏర్పాటు వేగవంతం కావాలని సీట్ల పంపకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ ని కోరినట్లు కోదండరాం చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటుపై హైదరాబాద్‌లోనే చర్చించాలని రాహుల్‌ చెప్పారన్నారు. మేం బలంగా ఉన్నచోట అవకాశం ఇవ్వాలని రాహుల్‌ను కోరామన్నారు. బంగారు తెలంగాణ కోసం… కాంగ్రెస్‌తో కలిసి నడవవాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుందని…కాంగ్రెస్ నేత మధుయాష్కి తెలిపారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ దోపిడీకి వ్యతిరేకంగా కోదండరాం ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు.

సీట్ల విషయంలో తెలంగాణ జన సమితి అధినేత చెబుతున్న లెక్కకు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న లెక్కలు చాలా తేడా ఉంది. టీజేఎస్ కు.. ఆరు, ఏడు సీట్ల దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ కోదండరాం కనీసం పదిహేనుకు తగ్గేది లేదంటున్నారు. అదే సమయంలో..సీపీఐ కూడా అసంతృప్తిగానే ఉంది. ఈ విషయంలో… కీలక నిర్ణయం తీసుకోవాలని..కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చినట్లుగా.. చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. అంతిమంగా.. సీట్ల సర్దుబాటు.. మహాకూటమి విషయంలో ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close