కొట్లాటకు సిద్ధం అంటున్న కోదండ‌రామ్‌!

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత టీజేఎస్ పార్టీ ఎలాంటి కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌లేదు. అలాగ‌ని, ఇత‌ర పార్టీలు చేప‌ట్టిన ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల నిర‌స‌న‌ల్లో కూడా పాల్గొన్న‌దీ లేదు! ఆ పార్టీ పెట్టిందే నిరుద్యోగులు, యువ‌త కోసం అంటూ అప్ప‌ట్లో ప్రొఫెస‌ర్ కె. కోదండ‌రామ్ చెప్పారు. కానీ, వారి త‌ర‌ఫున నిరంత‌ర పోరాటాలుగానీ, నిర‌స‌న‌లుగానీ, ఉద్య‌మాలుగానీ చేప‌ట్టిందీ లేదు. ఇన్నాళ్లూ రాజ‌కీయంగా కొంత మౌనంగా ఉంటూ వ‌చ్చిన కోదండ‌రామ్.. ఇప్పుడు నిరుద్యోగుల‌తో ఉద్య‌మిస్తా అంటున్నారు. క్షేత్ర‌స్థాయి నుంచి నిరుద్యోగ యువ‌త‌తో ఉద్య‌మ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వోద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడో చెప్పింద‌నీ, ఇంత‌వ‌ర‌కూ ఏవీ భ‌ర్తీ కాలేద‌నీ, ఈ తీరుకి నిర‌స‌నగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వ‌హిస్తామ‌ని కోదండ‌రామ్ ప్ర‌క‌టించారు. నిరాహ‌దీక్ష‌లు, అసెంబ్లీ ముట్ట‌డి లాంటి కార్య‌క్ర‌మాలు వ‌రుస‌గా ఉంటాయ‌న్నారు. ప్ర‌తీ గ్రామంలో ప‌దిమంది నిరుద్యోగుల‌తో క‌మిటీలు ఏర్పాటు చేస్తామ‌నీ, ఆ క‌మిటీల‌న్నీ క‌లిసి స్థానిక ఎమ్మెల్యేల‌ను క‌లుస్తాయ‌న్నారు. వివిధ సంఘాల‌తో స‌మావేశాలు, విద్యా సంస్థ‌ల బందులు నిర‌స‌నలు ఆ క‌మిటీలు చేప‌డ‌తాయ‌న్నారు. రాష్ట్రంలో రాజ‌కీయాలు బాగులేవ‌నీ, నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం లేద‌నీ, పోరాడితే త‌ప్ప నోటిఫికేష‌న్లు రావ‌న్నారు కోదండ‌రామ్‌.

నిరుద్యోగుల‌తో గ్రామ‌స్థాయి నుంచీ క‌మిటీలు వేయాల‌నే ఆలోచ‌న మంచిదే. ఓర‌కంగా పార్టీ నిర్మాణానికి కూడా ఇది బాగా ఉప‌యోప‌డుతుంది. నిరుద్యోగ యువ‌త‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ఇత‌ర రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఒక‌వేళ ఉన్నామ‌ని ప్ర‌క‌టించినా… కోదండ‌రామ్ ని న‌మ్మినంత‌గా ఇత‌ర పార్టీల‌ను నిరుద్యోగులు న‌మ్మే అవ‌కాశ‌మూ త‌క్కువే. కాబ‌ట్టి, సంస్థాగ‌తంగా టీజేఎస్ ని బ‌లోపేతం చేసే అవ‌కాశం ఈ ఆలోచ‌న‌లో క‌నిపిస్తోంది. నిరుద్యోగుల ప‌క్షాన పార్టీ నిలుస్తుంద‌నే భ‌రోసా క‌ల్పించ‌గ‌లిగితే… కోదండ‌రామ్ పార్టీకి కొంత శ‌క్తి పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే, ఈ క‌మిటీలూ ఉద్య‌మాలూ భారీ స్థాయిలో నిర్మించాలంటే… దానికిత‌గ్గ సాధ‌నాసంప‌త్తితోపాటు, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా కావాల్సి ఉంటుంది. కోదండ‌రామ్ వ్యూహం ఎలా ఉందో చూడాలి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close