హ్యాట్సాఫ్ టు పవన్, కోహ్లి, లక్ష్మణ్

ప్రస్తుతం మనం బత్రుకుతున్నది చాలా పెద్ద అబద్ధాల ప్రపంచం. ఆ అబద్ధాలకు పరాకాష్టగా మనం ప్రతి రోజూ చూసే ప్రకటనలను చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రకటనలతో సహా అన్ని రకాల యాడ్స్‌లో కూడా అసత్యాలను అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రకటనల్లో నటించేవాళ్ళకు, రూపొందించేవాళ్ళ నిజాయితీ ఎంత? వాళ్ళకు మనస్సాక్షి ఉంటుందా అంటే చెప్పలేం. కోటాను కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళ ఇంటికి నడిచొస్తూ ఉంటాయి. అయితే అలాంటి కోట్లాది రూపాయలను కాదనుకునే గ్రేట్ పర్సన్స్‌ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక సారి తప్పు చేసినప్పటికీ వెంటనే రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు.

క్రికెటర్స్ సంపాదనలో ఎక్కువ భాగం కూల్ డ్రింక్స్ ప్రకటనలతోనే వస్తుందా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. మరీ ముఖ్యంగా సచిన్ తరం క్రికెటర్స్‌కి అయితే కూల్ డ్రింక్స్ యాడ్స్ ఆదాయం అంతా ఇంతా కాదు. తోటి క్రికెటర్స్ అందరూ కూడా కూల్ డ్రింక్స్ యాడ్స్‌తో కోట్లు సంపాదించుకుంటూ ఉన్నప్పటికీ మన తెలుగు క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ మాత్రం …..‘కూల్ డ్రింక్స్ నేను తాగను…అలాంటి కూల్ డ్రింక్స్ తాగమని చెప్పి నా అభిమానులకు నేను ఎలా చెప్తాను’ అంటూ కూల్ డ్రింక్స్ యాడ్స్‌కి నో చెప్పాడు. నిజానికి హెల్త్ కాన్షన్ చాలా ఎక్కువ ఉండే మన క్రికెటర్స్, సినిమా స్టార్స్…ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పెప్సీ, కోలాలాంటి కూల్ డ్రింక్స్ తాగరు అన్నది నిజం. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయా? మంచి చేస్తాయా అన్న విషయం వాళ్ళకు చాలా బాగా తెలుసు. అయినప్పటికీ అభిమానులకు మాత్రం తాగమని చెప్తూ ఉంటారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లి కూడా ఒక సందర్భంలో చెప్పిన వాళ్ళే. అయితే ఒక్క యాడ్‌లో నటించిన వెంటనే పవన్ ఇక అలాంటి కూల్ డ్రింక్స్ యాడ్స్‌లో నటించనని చెప్పేశాడు. ఆ తర్వాత చిరంజీవి కూడా అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వడం ఎందుకని ఆ రకమైన యాడ్స్‌లో కనిపించడం మానేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి ఇప్పుడు విరాట్ కోహ్లి ఉన్న స్థాయికి మనవాడికి వందల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ తాను మాత్రం అలాంటి యాడ్స్‌లో నటించనని చెప్పాడు. ప్రపంచంలోనే నంబర్ ఒన్ అథ్లెట్ అవ్వాలనుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న కోహ్లి అభిమానులకు మాత్రం కూల్ డ్రింక్స్ తాగండి అని చెప్పి ఎలా చెప్పగలడు? మనస్సాక్షి ఒఫ్పుకుంటుందా? ఇక మరో అరుదైన క్రికెటర్ హషీమ్ ఆమ్లా గురించి కూడా చెప్పుకోవాలి. ఖురాన్‌లో చెప్పిన నీతిని తూచా తప్పకుండా పాటించే ఆమ్లా ఎన్నివేల కోట్లు ఇస్తామన్నా డ్రింక్స్‌తో సహా ఎలాంటి యాడ్స్‌లోనూ నటించడు. అలాగే తన జెర్సీపైన కూడా సౌత్ ఆఫ్రికా బోర్డ్‌తో కాంటాక్ట్ ఉన్న డ్రింక్స్ లోగోను ప్రింట్ చేయడానికి ఒప్పుకోడు. అందుకే ఆమ్లాకు అటూ ఇటూగా సగం ఆదాయమే వస్తుంది. అయితేనేం మనిషిగా మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. అందుకే అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న కోహ్లి, చిరంజీవి, లక్ష్మణ్, పవన్‌, ఆమ్లాలకు హ్యాట్సాఫ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]