రాజీనామాలు చేద్దాం రండి..! కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కోమటిరెడ్డి ఒత్తిడి..!!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ పెట్టారు. కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా … ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున రగడ సృష్టించారన్న కారణంతో … కోమటిరెడ్డి, సంపత్‌ లపై స్పీకర్ అనర్హతా వేటు వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో… ఆ నిర్ణయాన్ని కోర్టు కొట్టి వేసింది. కానీ శాసన వ్యవస్థలో జోక్యాన్ని కేసీఆర్ అంగీకరించే అవకాశం లేదు. తమ సభ్యత్వాలను పునరుద్ధరిస్తారన్న నమ్మకం… వారికి లేదు. అందుకే…టీఆర్ఎస్‌పై పోరాటానికి పార్టీ మొత్తం కలసి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసం కోమటిరెడ్డి చెప్పిన వ్యూహం..

ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్‌ను కోమటిరెడ్డి తెరపైకి తేవడానికి కారణం కూడా ఉంది. తమపై కేసీఆర్ వేటు వేసినా.. పీసీసీ పూర్తి స్థాయిలో తమకు మద్దతుగా నిలువలేదని.. కోమటిరెడ్డి, సంపత్ భావిస్తున్నారు. అందుకే కొన్నాళ్లు వాళ్లిద్దరూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన బస్సుయాత్రలో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు సందర్భం కలసి రావడంతో.. తమకు మద్దతుగా పార్టీ మొత్తం కలసి వచ్చేలా చేయడానికి ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అయితే పార్టీలో చర్చించకుండా.. దీన్ని కోమటిరెడ్డి దీన్ని మీడియా ముందు చెప్పడమేమిటని..ఇతర ఎమ్మెల్యేలు.. అసంతృప్తికి గురయ్యారు. రాజీనామాలకు ఒక్కరు కూడా సిద్దంగా లేరు.
మూకుమ్మడి రాజీనామాల డిమాండ్‌.. సీఎల్పీ నేత జానారెడ్డిని కూడా ఇబ్బందుల్లో నెట్టింది. కాదంటే కోమటిరెడ్డికి కోపం వస్తుంది..అవునంటే.. ఇతర ఎమ్మెల్యేలు కలసిరారు. అందుకే.. నేర్పుగా నిర్ణయం హైకమాండ్‌ చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఏ రూపంలో పోరాడాలని హైకమాండ్ నిర్దేశిస్తే అలా పోరాడుతామన్నారు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం సొంత పార్టీలోనే కలకలం రేపుతోంది. తమ పదవులు పోతే.. మిగతా ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉన్నారని.. తమ పరిస్థితే వారికి రావాలని కోమటిరెడ్డి, సంపత్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close