కాంగ్రెస్‌లో రేణుకాచౌదరి కాక..! కొప్పుల రాజునే టార్గెట్..!

కొప్పుల రాజు.. ఈ పేరు… బయట వారికి పెద్దగా తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు బాగా పరిచయం. రాహుల్ తరపున.. ఆయనే అన్ని వ్యవహారాలను చక్క బెడుతూ ఉంటారు. ఆయన చెబితే రాహుల్ చెప్పినట్లే. ఇప్పుడు ఈ కొప్పుల రాజుకు.. రేణుకాచౌదరి రూపంలో సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్లుగా ఉంటున్న రేణుకా గురువారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. భట్టి విక్రమార్కపైన.. ఆయనకు ఢిల్లీ స్థాయిలో అండదండలు అందిస్తోన్న కొప్పుల రాజుపైనా ఆమె కార్యకర్తల సమావేశంలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తనకు వ్యతిరేకంగా గ్రూపురాజకీయాలు నడుపుతున్నారని రేణుకా చౌదరి నమ్ముతున్నారు. 2009లో ఓడినా పార్టీ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో అనంతరం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఆ పదవి కాలం కూడా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల సమీక్షల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రేణుక చౌదరిపై కుంతియాకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఓటమికోసం ఆమె పనిచేశారని, చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తనను టార్గెట్ చేసి ఢిల్లీ స్థాయిలో కొప్పుల రాజు సహాకారం అందిస్తున్నారని అనుమానిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలుపును కూడా భట్టి ఖాతాలో వేసి అతనికి సీఎల్పీ వచ్చేలా చేసింది కూడా కొప్పుల రాజే అన్న ప్రచారం పార్టీలో ఉంది.

తెలంగాణ వ్యవహారాల్లో కొప్పుల రాజు జోక్యంపై రాష్ట్రనేతలు చాలామంది గుర్రుగా ఉన్నారు. కానీ ఏం చేయలేక కామ్ గా ఉండిపోతున్నారు. అయితే వారందరినీ కలుపుకుని రాహుల్ గాంధీని కలిసేందుకు రేణుక చౌదరి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్ోల కొప్పుల రాజుని వ్యతిరేకించే వారితో సమావేశానికి ప్లాన్ చేసినట్లుతెలుస్తోంది. అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్లి కొప్పుల పై పార్టీపెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్‌పై రేణుకా చౌదరి గురి పెట్టి.. రాజకీయాలు చేయబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close