కొత్తపలుకు: కేసీఆర్ 30 లోక్‌సభ సీట్ల ఆశల లాజిక్ ఆంధ్రజ్యోతి ఆర్కే భలే చెప్పారే..!

జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు … చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ.. ఆంధ్రజ్యోతి ఆర్కే లాంటి జగమెరిగిన జర్నలిస్టుకు మాత్రం… అందులో ఉన్న లోతైన రాజకీయం ఏమిటో కూడా… తెలిసిపోతోంది. ఈ వారం కొత్త పలుకు ఆర్టికల్‌లో చాలా వరకూ.. కేసీఆర్ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. ఏపీలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి… టీఆర్ఎస్ ఎందుకు బాహాటంగా మద్దతు పలుకుతోంది..?. దానికి కారణం… ” ఏపీలో చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే జాతీయ రాజకీయాలలో కూడా తనదే పైచేయి అవుతుందన్నది కేసీఆర్ నమ్మం”. టీఆర్ఎస్ తెలంగాణలో పదహారు సీట్లు గెల్చుకుని… ఏపీలో జగన్మోహన్రెడ్డి 15 లోక్సభ స్థానాల వరకు గెలుచుకోగలిగితే ఇరువురికీ కలిపి 30 మంది ఎంపీల బలం ఉంటుంది కనుక సార్వత్రిక ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఈ 30 మంది మద్దతు కీలకం అవుతుందన్నది కేసీఆర్ ఆలోచనట. జగన్.. కేసీఆర్ ఏది చెబితే అది చేస్తారా.. అంటే… చేయక తప్పదన్నట్లుగా ఉంటుంది మరి వ్యవహారం.

తనతో ఫెడరల్ ఫ్రంట్‌లో ఇతర పార్టీలు వస్తాయని.. కేసీఆర్ నమ్మడం లేదు. ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా జగన్ కోసమేనని అంటున్నారు. ఎవరు చేతులు కలిపినా, కలపకపోయినా కొత్త మిత్రుడైన జగన్మోహన్‌ రెడ్డి ఏపీలో మెజారిటీ ఎంపీలను గెలుచుకుంటే కేంద్రంలో తాను కీలకపాత్ర పోషించవచ్చుననీ, అదే జరిగితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని కుమారుడైన కేటీఆర్‌కు కట్టబెట్టి.. తాను ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారట. కేటీఆర్ కూడా తాను త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కేంద్రంలో కేసీఆర్‌కు కీలక పాత్ర పోషించే అవకాశం రాకపోతే.. ఆయనే సీఎంగా ఉంటారట.

జాతీయ రాజకీయాలలో తనకు పోటీగా ఉండే అవకాశం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్‌గా చేసుకున్నారని ఆర్కే తేల్చారు. అఖిలేశ్, మాయావతి, నవీన్ పట్నాయక్ మినహా మిగతా బీజేపీ పార్టీ వ్యతిరేక శక్తులన్నింటినీ కాంగ్రెస్‌తో కలిసి ఒకే వేదికను పంచుకునేలా చంద్రబాబు చేయగలిగారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి చక్రం తిప్పలేరని ఆర్కే తేల్చేశారు. అందుకే.. చంద్రబాబును.. మరింతగా ఇబ్బంది పెట్టి ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డికి భారీగా ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆర్కే చెబుతున్నారు. జగన్‌ గెలవడానికి తన వంతు ప్రయత్నం చేస్తే… చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా వర్తమాన రాజకీయాలలో తెలుగునాట తనదే పైచేయి అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్కే చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కానీ మ్యాజిక్ జరుగుతుందా..అనేదే సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close