క్రిష్‌లో ఈ కోణం కూడా ఉందా?

క్రిష్ అన‌గానే ఓ గ‌మ్యం, ఓ వేదం, ఓ కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ గుర్తొస్తాయి. సున్నిత‌మైన భావోద్వేగాల్ని ఆయ‌న తెర‌పై ఆవిష్క‌రిస్తుంటారు. ఆయ‌న్నుంచి క్లీన్ ‌సినిమాలే వ‌స్తుంటాయి. క‌మర్షియ‌ల్ ట‌చ్ కోస‌మైనా ఆయ‌న గీత దాటింది లేదు. అందుకే ఆయ‌నపై క్లాస్ ద‌ర్శ‌కుడ‌నే ముద్ర ప‌డిపోయింది. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా`తో ఆయ‌న‌లోని మ‌రో కోణం కూడా బ‌య‌ట‌ప‌డిపోయింది. క్రిష్‌లో చాలా బోల్డ్‌నెస్ ఉంద‌ని అర్థ‌మైంది.

అల్లు అరవింద్ నుంచి ‘ఆహా’ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొద‌లైంది. నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌లానే ఇందులో వెబ్ సిరీస్‌లూ, సినిమాలూ, షోలూ ఉంటాయి. అందులో భాగంగా ‘మ‌స్తీస్‌’ అనే వెబ్ సిరీస్ రూపొందించారు. న‌వ‌దీప్‌, హెబ్బా ప‌టేల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్ కంటెంట్ ఉంది. పెద్ద‌ల‌కు మాత్ర‌మే స‌న్నివేశాలూ క‌నిపించ‌నున్నాయి. అయితే వెబ్ సిరీస్ లలో ఇంత బోల్డ్‌నెస్ ఉండ‌డం కామ‌నే. కానీ ఈ వెబ్ సిరీస్‌కి క‌థ అందించింది మాత్రం క్రిష్‌. ప‌ద్ధ‌తైన క‌థల‌తో సినిమాలు తీసే క్రిష్‌.. ఇంత బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సిరీస్ అందించారంటే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ”నా నుంచి ఎక్కువ‌గా చారిత్ర‌క సినిమాలే వ‌స్తాయ‌నుకుంటారు. అయితే నాలో ఇంకో క్రిష్ ఉన్నాడు. నాలోని మ‌రో కోణం ఈ వెబ్ సిరీస్ ద్వారా బ‌య‌ట‌కు రానుంది” అంటున్నారు క్రిష్‌. ద‌ర్శ‌కుడిగా క్లాస్ సినిమాలు అందించిన క్రిష్‌, క‌థ‌కుడిగా ఇంత మాస్ కంటెంట్ అందించారంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close