బాహుబ‌లి నిర్మాత‌ల‌తో క్రిష్ సినిమా

మ‌హానాయ‌కుడు త‌ర‌వాత క్రిష్ చేయ‌బోయే సినిమా ఏమిట‌న్న‌ది ఇంకా స‌స్పెన్స్‌గా ఉంది. గ‌త కొన్ని నెల‌లుగా తీర‌క లేకుండా గ‌డుపుతున్నాడు క్రిష్‌. అటు మ‌ణిక‌ర్ణిక‌, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలుతో బాగా బిజీ బిజీగా ఉన్నాడు. మ‌హానాయ‌కుడు రిలీజ్ అయిన వెంట‌నే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని ఫిక్స‌య్యాడు. అయితే ఆ త‌దుప‌రి సినిమాలు ఎవ‌రితో చేయాలి? అనే విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చింది.

బాహుబ‌లి నిర్మాత‌లైన శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిల‌తో క్రిష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఎలాంటి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కాలి? అనే విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుదిరింది. అయితే అంత‌కంటే ముందు క్రిష్ త‌న సొంత సంస్థ అయిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర‌వాతే.. ఆర్కా మీడియా సినిమా ఉండ‌బోతోంది. ఈసారి పెద్ద హీరోతో చేయాలా? లేదంటే కొత్త‌వాళ్ల‌తో ముందుకెళ్లాలా? అనే విష‌యంలో క్రిష్ ఇంకా ఓ నిర్దార‌ణ‌కు రాలేదు. త‌న ద‌గ్గ‌ర రెండు మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. క‌థ‌ని బ‌ట్టి క‌థానాయ‌కుడ్ని ఎంచుకోవ‌డం క్రిష్ శైలి. ఈసారీ అదే జ‌ర‌గ‌బోతోంది. త్వ‌ర‌లో క్రిష్‌సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close