రెండు పడవల మీద క్రిష్ కాలు…

హృతిక్ రోషన్ వర్సెస్ కంగనా రనౌత్ గొడవ ఏమో గానీ… దర్శకుడు క్రిష్ నెత్తి మీద ఇప్పుడు ఒకటికి రెండు సినిమాల బాధ్యతలు పడ్డాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా కంగనా రనౌత్ నటిస్తున్న ‘మణికర్ణిక’ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నారు. కానీ, గ్రాఫిక్స్ సకాలంలో పూర్తికాలేదు. అందువల్ల, వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి వాయిదా వేశారు. అదే వీకెండ్ హృతిక్ రోషన్ ‘సూపర్30’ విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. హృతిక్, కంగన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ఇద్దరి సినిమాలు పోటాపోటీగా విడుదలకు సిద్ధమవడం హిందీలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ, తెలుగు దర్శకుడికి మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది.

‘మణికర్ణిక’ వాయిదా పడటంతో క్రిష్ డబుల్ డ్యూటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క హైదరాబాద్‌లో ‘యన్.టి.ఆర్’ బయోపిక్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ… మరోపక్క మధ్య మధ్యలో ముంబై వెళ్లి ‘మణికర్ణిక’ గ్రాఫిక్ వర్క్స్ చూసుకోవాలి. రెండిటికీ దర్శకుడు ఆయనే కదా!

రెండు సినిమాలు వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి సంక్రాంతికి. మరొకటి గణతంత్ర దినోత్సవానికి. హిందీలో విడుదలకు రెండు మూడు నెలల ముందు నుంచి పబ్లిసిటీ మొదలు పెడతారు. అవీ చూసుకోవాలి. ఇక్కడ బాలకృష్ణ హీరోగా తెరకెక్కించే ‘ఎన్టీఆర్ బయోపిక్ పనులూ చూసుకోవాలి. బహుశా… క్రిష్ కూడా ఇటువంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకుని వుండడు. దర్శకుడిగా రెండు పడవల (రెండు సినిమాలు) మీద కాలు వేసి క్రిష్ ఎలా నెగ్గుకొస్తాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close