క్రిష్ జాక్ పాట్ కొట్టాడా..!

సున్నితమైన భావోద్వేగాలనే సినిమా రూపంలో పెట్టి వాటికి నూటికి నూరు పాళ్లు ప్రేక్షకులకు చేరువేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు క్రిష్ లాస్ట్ ఇయర్ కంచె అంటూ వచ్చి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే అదే ఊపుతో వరుణ్ తేజ్ తో రాయభారి అనే సినిమా స్టార్ట్ చేసినా అది ముందుకు సాగే ప్రయత్నాలు జరుగలేదు. అయితే జరిగిన విషయాన్ని పక్కనపెట్టి మరో సూపర్ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడట క్రిష్.

ఈ గ్యాప్ లో ఓ కథని సిద్ధం చేయడం అది బాలీవుడ్ అక్షయ్ కుమార్ కు వినిపించి అతన్ని మెప్పించడంతో పాటుగా తమిళ హీరోని కూడా ఇంప్రెస్ చేసి సినిమాకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ లో అక్కి హీరోగా చేస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో తో తెలుగు, తమిళ భాషల్లో వదిలే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో క్రిష్ బాలయ్యకు ఓ కథ వినిపించాడని బాలకృష్ణ వందో సినిమా క్రిష్ డైరక్షన్ లోనే వస్తుందని తెగ హడావిడి చేశారు. మొత్తానికి బాలయ్య వందో సినిమా నుండి క్రిష్ బయటకు వచ్చాడని మాత్రం చెప్పొచ్చు. మరి చేస్తున్న ఈ త్రిభాషా చిత్రం క్రిష్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]