మ‌ళ్లీ పెన్ను ప‌ట్టిన కృష్ణ‌భ‌గ‌వాన్‌

ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌యాణాన్ని మొద‌లెట్టాడు కృష్ణ‌భ‌గవాన్‌. ఆ త‌ర‌వాత న‌టుడిగా మారారు. న‌టుడిగా బిజీ అవ్వ‌డం వ‌ల్ల తాత్కాలికంగా పెన్ను ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు సుదీర్ఘ‌విరామం త‌ర‌వాత ఓ సినిమా కోసం క‌థ‌, మాట‌లు రాశారు. అల్లరి న‌రేష్ క‌థానాయ‌కుడిగా జాహ్న‌వి ఫిలిమ్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. అవీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి కృష్ణ‌భ‌గ‌వాన్ క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. సెప్టెంబ‌రులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అలా ఎలా తో ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకొన్న అవీష్ కృష్ణ‌కు ఇది రెండో సినిమా. క‌థ‌నాయిక‌నీ, మిగిలిన సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

కొత్తత‌రం హ‌వాతో.. కృష్ణ‌భ‌గ‌వాన్ జోరు బాగా త‌గ్గింది. ఆయ‌న కామెడీ పంచ్‌లు ఈమ‌ధ్య పేల‌డం లేదు. న‌టుడిగా త‌న ఇన్నింగ్స్ చాలా స్లోగా సాగుతోంది. అందుకే రైట‌ర్‌గా త‌న‌ని తాను మ‌ళ్లీ ప‌రీక్షించుకోవాల‌నుకొంటున్నాడు కృష్ణ‌భ‌గ‌వాన్‌. న‌టుడిగా బిజీగా ఉన్న‌ప్పుడు భ‌గ‌వాన్‌కి రైట‌ర్‌గా చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే.. అప్ప‌ట్లో టైమ్ స‌రిపోక ఒప్పుకోలేదు. ఇప్పుడు మ‌ళ్లీ రైట‌ర్‌గా త‌న ప్ర‌తాపం చూపించాల‌నుకొంటున్నాడు. మ‌రి కృష్ణ‌భ‌గ‌వాన్ పంచ్‌లో ప‌దును త‌గ్గిందో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close