ఏపీలో కులపిచ్చి ..తెలంగాణలో అది లేదు: కేటీఆర్‌

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఆయన ఇప్పటి వరకూ చెప్పని ఓ విచిత్రమైన కారణం చెప్పారు. తెలంగాణలో కులపిచ్చి లేదని… కానీ ఆంధ్రాలో అదే బలమైన అంశం అంటున్నారు. ఎన్నికల నేపధ్యంలో.. కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయనలో.. ఏపీలో కులపిచ్చి అంటూ వ్యాఖ్యలు చేయడం.. జర్నలిస్టులను సైతం ఆశ్చర్య పరిచింది. కులం అనేది ఒక్క ఏపీకే ఉన్నట్లు… తెలంగాణలో లేనట్లు ఆయన మాట్లాడారు. తెలంగాణలో కులం అనేది లేకపోతే కులాల వారీగా ఆత్మగౌరవ భవనాల పేరుతో కేసీఆర్ చేసిన రాజకీయం ఏమిటన్న విమర్శలు అప్పుడే ప్రారంభమయ్యాయి. అసలు రాజకీయం అంటే.. కులం సమీకరణాల ఆధారంగా నడుస్తుంది. ఆ కులసమీకరణాలు ఇప్పుడు.. టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవు. రెడ్లకు రాజ్యాధికారం కావాలని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. వారు తెలంగాణలో పది శాతానికిపైగా ఉన్నారు. కానీ కేసీఆర్ సామాజికవర్గం వెలమ మాత్రం.. ఒకటి, రెండు శాతమే ఉంటుందని చెబుతూంటారు. అందుకే.. తెలంగాణలో కుల ప్రస్తావన లేదని చెప్పుకోవడానికి.. ఏపీపై కేటీఆర్ ముద్ర వేసే ప్రయత్నం చేశారన్న భావన రాజకీయవర్గాల్లో వస్తోంది.

మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ గా మాట్లాడిన కేటీఆర్ టీఆర్‌ఎస్‌ 100 స్థానాల్లో గెలుస్తుందని మళ్లీ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను చూసే ఓటేస్తామని సామాన్య జనం అంటున్నారని ెచప్పుకొచ్చారు. కూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని విశ్లేషించారు. రాహుల్, సోనియా ప్రచారంతో ఏదో అయిపోతోందని అనుకోవటం లేదన్నారు. 2004లో హైదరాబాద్ అభివృద్ధి చేశామన్న చంద్రబాబుకు ఒక్క సీటు రాలేదని గుర్తు చేశారు. 2014లో మాపై గ్రేటర్‌ ప్రజలకు కొన్ని అనుమానాలు..అందుకే సీట్లు రాలేదు ఇప్పుడు… సెటిలర్లంతా తమ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. హరీష్ రావు వ్యవహారంపైనా కేటీఆర్ స్పందించారు. ఇంకా 15 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా ఉండాలని మా ఆకాంక్ష అన్నారు. హరీశ్‌పై కూడా దిక్కుమాలిన ఆరోపణలు చేశారని … హరీశ్‌కు తనకు కుటుంబం ఫస్ట్..ఆ తర్వాతే రాజకీయాలన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 70 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూడా తేలిగ్గా తీసి పడేశారు. బీజేపీకి 70 మంది అభ్యర్థులే దిక్కు లేదు…ఇంకా 70 సీట్లు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. బీజేపీ సిట్టింగ్‌ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలుపుతామని ప్రకటించారు.

కాంగ్రెస్ టీడీపీ పొత్తుపైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతినిధి కాదన్నారు. చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని వ్యంగ్యంగా విమర్శించారు. అమ్మనా బొమ్మనా అని ఆవేశంతో అంటే రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలు..చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం మమ్మల్ని మేల్కొలిపిందని అందుకే మేము ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నామని సమర్థించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close