ఏపీ సొమ్ముతో తెలంగాణ‌ ప్ర‌చారం చేస్తున్నార‌ట‌..!

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేశారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున సొమ్ము పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లోని ప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్ల‌లో కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ప్ర‌క‌ట‌న‌లు వేయిస్తున్నార‌న్నారు. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల సొమ్ము అనీ, ఆ సొమ్ముతో తెలంగాణ‌లో ప్ర‌చారం చేసుకుంటున్నార‌న్నారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి ఎలా అవుతుంద‌నేది ఎన్నిక‌ల క‌మిష‌న్ ను తాము ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు. ఈ ధోర‌ణికి వెంట‌నే అడ్డుక‌ట్ట వేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇదివ‌ర‌కే చంద్ర‌బాబు మీద ఒక ఆరోప‌ణ చేశార‌నీ, రూ. 500 కోట్ల ఖ‌ర్చుతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఒప్పందాన్ని కుదుర్చుకున్నార‌ని బ‌హిరంగ స‌భ‌లో చెప్పార‌ని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎంల మ‌ధ్య ఈ ఒప్పందం కుదిరింద‌ని ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అవినీతి ద్వారా పెద్ద ఎత్తున సంపాదించిన సొమ్మును క‌ట్ట‌లు గ‌ట్టి తెలంగాణ‌కు చేరవేరే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ఈ క్ర‌మంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌నీ, ఇక్క‌డి రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటున్నారనీ, పోలీసు వాహ‌నాలు.. అంబులెన్సుల ద్వారా సొమ్ము ర‌వాణా చేసి పంపిణీకి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఇక్క‌డి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్ని చంద్ర‌బాబు న‌మ్మడం లేద‌నీ, ఆయ‌నే స్వ‌యంగా డ‌బ్బులు పంపిణీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ఈ ప్ర‌య‌త్నానికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అడ్డుక‌ట్ట వేయాల‌నీ, నేత‌ల వాహ‌నాలను త‌నిఖీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

మొత్తానికి, తెరాస ఎన్నిక‌ల ప్ర‌చారం, విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లూ అన్నీ టీడీపీ చుట్టూనే పెరుగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తే… తెలంగాణ పాల‌నా ప‌గ్గాలు చంద్ర‌బాబు చేతికే వెళ్లిపోతాయ‌ని ఆరోపిస్తున్నారు. కూటమికి ఓటేస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయ‌నీ, 24 విద్యుత్ ఆగిపోతుంద‌నీ, రైతుబంధు ఉండ‌ద‌నీ… ఇలా ఇంకోప‌క్క ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పుడేమో… స్వ‌యంగా చంద్ర‌బాబే వంద‌ల కోట్లు పంపిణీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటారు! అది కూడా నిఘా వ‌ర్గాల‌నూ పోలీసుల‌నూ వాడుకుకొన‌ట‌! అంటే, ఆయా వ్య‌వ‌స్థ‌ల‌పై తెరాస‌కు గౌర‌వం ఉందా అనే అనుమానాలు క‌లిగించే విధంగా ఉన్నాయీ వ్యాఖ్య‌లు. అయినా, రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేయాల‌నుకున్న‌ప్పుడు… ఆ సొమ్ము కాంగ్రెస్ కి ఇచ్చి, ఆ పార్టీ విదిల్చిన సీట్ల‌లో పోటీ చేయాల్సిన ప‌రిస్థితి టీడీపీకి ఎందుకు..? ఆ స్థాయిలో ఖ‌ర్చు చేద్దామ‌నుకున్న‌ప్పుడు నేరుగా పోటీకి దిగితే ఎక్కువ స్థానాలు వ‌స్తాయేమో క‌దా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close