యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్..! ఇప్పుడిదే హాట్ టాపిక్..!

తెలంగాణా మంత్రి వర్గంలో కేసీఆర్ తర్వాత కేటీఆరేనని అందరికీ తెలుసు. ఇప్పుడు కేటీఆర్ మరింత ముందుకు వెళ్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఆయన తన శాఖలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయన కీలకమైన అన్ని శాఖలలోనూ… కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాలను నియమిస్తుంది. ఈ ఉప సంఘం అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక సబ్ కమిటీలన్నింటిలో కేటిఆర్ సభ్యుడిగా నియమిస్తున్నారు సిఎం కేీసీఆర్.గత రెండేళ్లలో పదికి పైగా సబ్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.ప్రభుత్వానికి ఆర్టీసీ సంఘాలు ఢీ అంటే ఢీ అన్నాయి..ఈ సమయంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారు.కొన్ని విషయాలలో చొరవ తీసుకున్నారు. కేటీఆర్ ఒత్తిడి వల్లే సిఎం కేసీఆర్ పదహారు శాతం మధ్యంతర భృతికి అంగీకరించారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన అంశాలపై కూడా ఆయనే నేరుగా డీల్ చేస్తున్నారు. చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న రైస్ మిల్లు యాజమాన్యాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేటు జూనియర్,డిగ్రీ,పాఠశాలల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి దీంతో ఆయన చొరవ తీసుకొని ఉప ముఖ్యమంత్రి కడియం,మంత్రి జగదీష్ రెడ్డి లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తీసుకొని సమస్యలు పరిష్కరించడం. సబ్ కమిటీ సమావేశాలలో కీలక అంశాలపై చొరవ తీసుకుంటుండంతో కేటీఆర్‌ను యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా అందరూ పిలుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close