కేటీఆర్‌ని యుగపురుషుడ్ని చేస్తున్న టీఆర్ఎస్ నేతలు!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో జరగనుంది. ఇరవై నాలుగోతేదీన ఆయన బర్త్ డే జరుపుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో హడావుడి కనిపిస్తోంది. ఆయనకు కొత్తగా యుగపురుషుడు అని టైటిల్ ఇచ్చి పొగడ్తల ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా వీడియో చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కేటీఆర్ గురించి ఆయన ప్రస్థానం గురించి వివరించారు. యువతకు ఆయన గొప్ప ఇనిస్పిరేషన్ అని చెప్పారు. దానికి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ధ్యాంక్స్ చెప్పారు.

ఆ వీడియోని టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా షేర్ చేసుకుటున్నారు. ఈ సారి కేటీఆర్ బర్త్ డేకు ముందస్తుగా అంత హడావుడి కనిపించడం లేదు. గతంలో అయితే అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వడం.. వికలాంగులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వంటివి చేసేవారు. ఈ సారి వివిధ కారణాలతో సేవా కార్యక్రమాలు తగ్గిపోయాయి. అయితే ఈ సారి సోషల్ మీడియాలో కేటీఆర్ పుట్టిన రోజు మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇటీవలి కాలంలో ట్రెండింగ్ లను ఓ అసైన్‌మెంట్‌గా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తోంది.

కేసీఆర్ ముందుముందు జాతీయ రాజకీయాలకే పరిమితం కావాలనుకుంటున్నారు. ఇక నుంచి తెలంగాణలో కేటీఆర్‌దే ఆధిపత్యం ఉండనుంది.అందుకే .. పార్టీ నేతలు కూడా కేసీఆర్ కంటే.. కేటీఆర్‌కే ప్రాదాన్యం ఇస్తున్నారు. ఈ పుట్టినరోజుకు తమ టాలెంట్ అంతా చూపించి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close