కేటీఆర్‌ది కాన్ఫిడెన్సా ? కవరింగా ?

తమకు 90 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది కానీ తాము ముందస్తుకు వెళ్లే ప్రశ్నే లేదని కేటీఆర్ చెబుతున్నారు. రెండు రోజులుగా వచ్చిన సర్వే ఫలితాల అంశంపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌ చేసిన ఆయన.. ఆ సర్వేలన్నీ ప్రతిపక్షాలు చేయించుకున్నవని వాటిలోనూ తాము గెలుస్తామని తేలిందన్నారు. తాము సీట్లు గెలుస్తామని కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అంటున్నారు.

తమ ఒక్క పార్టీనే రాష్ట్రం మొత్తం ఉందన్నారు. కేసీఆర్ ఎవ‌రికీ బెద‌ర‌డు.. లొంగ‌డు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. వాపును చూసి కొంద‌రు బ‌లుపు అనుకుంటున్నారని విశ్లేషించారు. తాము అసెంబ్లీని రద్దు చేస్తామని చెప్పలేదని.. బీజేపీ వాళ్లు తేదీ ప్ర‌క‌టిస్తే అసెంబ్లీ ర‌ద్దు చేస్తామ‌ని సీఎం చెప్పారు. కానీ బీజేపీ నుంచి స్పంద‌న లేద‌న్నారు కేటీఆర్. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలో ఉంద‌న్నారు.

తెలంగాణలో పలు సంస్థలు రోజుకో సర్వేను వెలువరిస్తున్న సందర్భంలో కేటీఆర్ తమ సర్వే గురించి చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తమకు 90 స్థానాలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్‌కు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం సేవలు అందిస్తోంది. వారే సర్వేలు చేస్తున్నారు. అయితే కేటీఆర్ తమపై ప్రజాగ్రహం ఉందని పరోక్షంగా అంగీకరిస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్ష‌న్లు ఇస్తామ‌ని ఆయన చెబుతున్నారు. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయడం లేదు. అలాగే ధరణి పెద్ద సమస్యగా మారింది. దానిలోనూ మార్పులు చేస్తామని చెబుతున్నారు.

పలు సర్వేల్లో టీఆర్ఎస్‌ మొదటి స్థానంలోఉంటుందని తేలుతున్నా… గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం కావడం లేదు. కేటీఆర్ మాటల్లోన మునపటి ధీమా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close