ఆ చ‌ర్చ‌కు మంత్రి కేటీఆర్ ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు!

కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆర్ అనీ, దేశం కేసీఆర్ వైపు చూస్తుంటే.. యువ‌త‌రం కేటీఆర్ వైపు చూస్తోంద‌నీ, ఆయ‌న ముఖ్య‌మంత్రి అయితే అభివృద్ధి మ‌రింత ప‌రుగులు తీస్తుంద‌ని మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, అవునా.. కేటీఆర్ రెడీ అయిపోయారా, కేసీఆర్ కూడా అదే వ్యూహంతో ఉన్నారా అనే చ‌ర్చ మ‌ళ్లీ తెర మీదికి వ‌చ్చింది. ఇప్పుడు ఆ అంశ‌మ్మీద మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్లో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… కాబోయే సీఎం తానే అనేది వాస్త‌వం కాద‌న్నారు. మ‌రో ప‌దేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఉంటార‌నీ, ఆ మాట‌ను ఆయ‌నే స్వ‌యంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పార‌ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేటీఆరే సీఎం అంటూ మ‌ళ్లీ ప్రచారం చేస్తుండ‌టం భావ్యం కాద‌న్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఈవారంలో స‌మావేశం జ‌రుగుతుంద‌నీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేస్తార‌ని కేటీఆర్ చెప్పారు. కొత్త మున్సిప‌ల్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్యం అన్నారు. చ‌ట్టం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే కౌన్సిల‌ర్ల‌పై చ‌ర్య‌లుంటాయ‌న్నారు. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని, 2020 నుంచి 2030 వ‌ర‌కూ రాబోయే ద‌శ‌కం తెరాస పార్టీదే అన్నారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌దులుకుంటున్నట్టు చేసిన ప్ర‌క‌ట‌న‌పై స్పందిస్తూ… అది ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశ‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ త‌క్కువ‌గా చూడ్డానికి వీల్లేద‌నీ, ఆ పార్టీకి సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌న్నారు. భాజ‌పా గురించి మాట్లాడుతూ… తాను చిన్న‌ప్పుడు ఎలా అయితే భాజ‌పాని చూశానో, ఇప్పుడూ అలానే ఉంద‌ని ఎద్దేవా చేశారు.

కాబోయే సీఎం కేటీఆర్ అన‌గానే… పార్టీ వ‌ర్గాల్లో మళ్లీ వార‌స‌త్వ చ‌ర్చ ఈ మ‌ధ్య తెర‌మీదికి వ‌చ్చింద‌ని స‌మాచారం. కేసీఆర్ త‌రువాత సీఎం అయ్యే అర్హ‌త‌లు కేటీఆర్ తోపాటు, మంత్రి హ‌రీష్ రావుకీ ఉన్నాయ‌నీ, ఆయ‌నేం త‌క్కువ కాదంటూ అర్హ‌త‌ల బేరీజు వేసుకునే చ‌ర్చ గులాబీ ద‌ళంలో కొద్దిరోజులుగా మొద‌లైంద‌ట‌. ఈ చ‌ర్చ‌ను ఇక్క‌డితో ఆప‌క‌పోతే ఇది మ‌రోసారి త‌ల‌నొప్పి కార‌ణం అవుతుంది. అందుకే, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దామ‌ని మంత్రి కేటీఆర్ ఇలా స్పందించిన‌ట్టుగా భావించొచ్చు. ఒక‌టైతే వాస్త‌వం… కేసీఆర్ రాజ‌కీయ వారసుడి చ‌ర్చ ఏ రూపంలో తెర మీదికి వ‌చ్చినా… కేటీఆర్ కి స‌మాన స్థాయిలో హ‌రీష్ రావు పేరు అప్పుడూ ఇప్పుడూ వినిపిస్తూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close