చంద్ర‌బాబును వ్య‌తిరేకిగా చూపే కేటీఆర్ ప్ర‌య‌త్నం!

ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఈ సంద‌ర్భంగా ఎల్లారెడ్డిపేట‌ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ… ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌ సాగునీటి ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకం అని ఆరోపించే ప్ర‌య‌త్నం చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌నీ, దీనికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ర‌ద్దు చెయ్యాల‌నీ అని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశార‌న్నారు కేటీఆర్‌. ఎండిపోయిన పాల‌మూరు గొంతు త‌డిపే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తే… ఆ పాల‌మూరు అక్ర‌మ ప్రాజెక్టు, దీనికి అనుమ‌తి ఇవ్వొద్దూ అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశార‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలో గోదావ‌రి మీద సీతారామ ప్రాజెక్టు కూడా అక్ర‌మ‌మ‌నీ, దీనికి కూడా ప‌ర్మిష‌న్ ఇవ్వొద‌న్నారని చెప్పారు.

‘ఒక‌వేళ, పొర‌పాటునో ప్ర‌జ‌ల గ్ర‌హ‌పాటునో ఈ మ‌హా కూట‌మి.. వ‌చ్చేది లేదు, చచ్చేది లేదుగానీ.. అధికారంలోకి వ‌చ్చిందే అనుకోండి! కాంగ్రెస్‌, తెలుగుదేశం క‌లిసి అధికారంలోకి వ‌స్తే ఈ ప్రాజెక్టు ఏమైత‌యి..? చెయ్యొద్దూ అని చంద్ర‌బాబే ఉత్తరాలు రాస్తున్నారు, మ‌రి, అదే చంద్ర‌బాబు చేతిలో రేపు గ‌వ‌ర్న‌మెంట్ ఉంటే… అయితాయా ప్రాజెక్టులు, రైతుల‌కు నీళ్లు వ‌స్త‌యా..?’ అంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా ఎద్దేవా చేశారు. త‌న‌కంటే బాగా ప‌నిచేసే అభ్య‌ర్థులు తెలుగుదేశం, కాంగ్రెస్‌, వేరే ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నా… వారికి ప్ర‌జ‌లు ఓటెయ్యొచ్చ‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాను కాబ‌ట్టే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అన్నారు.

కొన్నాళ్ల కిందట… ఇదే కేటీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మెచ్చుకున్నారు! హైద‌రాబాద్ ఐటీ రంగం ఈరోజున ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దానికి చంద్ర‌బాబు నాయుడు చేసి కృషే కార‌ణ‌మ‌న్నారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో చంద్ర‌బాబు ముద్ర ఎప్ప‌టికీ ఉంటుంద‌న్నారు! ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి… ఇలా ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టారు కేటీఆర్‌. టీడీపీని తెలంగాణ వ్య‌తిరేక పార్టీగానూ, చంద్ర‌బాబును రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగానూ ప్ర‌జ‌ల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్‌. చంద్ర‌బాబు చేతిలో అధికారం పెడితే… ప్రాజెక్టులు పూర్తి కావ‌నే భ‌యాన్ని ప్ర‌జ‌ల‌కు క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు! ఒక‌వేళ మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌చ్చినా… కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని న‌డుపుతుంది, టీడీపీకి ఆ స్థాయి నిర్ణయాధికారం ఉంటుందా..? రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికీ టీడీపీ క‌ట్టుబ‌డి ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ప్ర‌త్యేకంగా రైతులు పాయింటాఫ్ వ్యూ నుంచి, సాగునీటి ప్రాజెక్టుల ప్ర‌స్థావ‌న తీసుకొచ్చి చంద్ర‌బాబుపై కేటీఆర్ విమ‌ర్శ‌ల‌కు మ‌రో నేప‌థ్యం కూడా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే బాబ్లీ ప్రాజెక్టు పోరాటం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్టు పూర్త‌యితే తెలంగాణ‌లో కొన్ని జిల్లాలు ఎండిపోతాయ‌నీ, ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌ని చంద్ర‌బాబు నాడు పోరాటం చేశారు. ఆ అంశం ఇప్పుడు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో, తెలంగాణ రైతాంగం టీడీపీ వైపు తొంగి చూస్తుంద‌న్న ఆలోచ‌న తెరాస‌కు ఉండే ఉంటుంది! ఫ‌లిత‌మే కేటీఆర్ వ్యాఖ్య‌లూ అనుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close