నాన్నకు ప్రేమతో.. : కేటీఆర్‌ కోరిక ఏంటంటే..?

తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలు అంటే.. ఇంచుమించుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ రాజకీయాలు అన్న చందంగా తయారైన సంగతి అందరికీ తెలిసిందే. ఏ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నా.. రాష్ట్రంలో దేనికి సంబంధించిన ఏ నిర్ణయం రావాలన్నా సరే.. కేసీఆర్‌ కుటుంబంలోని ఎవరో ఒకరి ప్రమేయం లేకుండా జరగదు అనే సంగతి కూడా అందరికీ బోధపడిపోయింది. కేసీఆర్‌ హవా ముద్ర పరిపాలన వ్యవస్థ మీద అంతగా పడిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ రాజకీయ వారసుడు ఎవరు? ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేది ఎవరు అనే చర్చ కూడా తరచూ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తూ ఉంటుంది. ప్రధానంగా కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావుల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. మధ్యలో ఓసారి వారసత్వం ఖచ్చితంగా కేటీఆర్‌కు మాత్రమే దక్కుతుందంటూ ఆయన కూతురు కవిత వ్యాఖ్యానించడమూ విశేషం.

ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్‌ మాత్రం ముఖ్యమంత్రి పదవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కుర్చీ మీద మోజు లేదని ఆయన వెల్లడించారు. తనకు సీఎంకుర్చీ మీద ధ్యాసలేకపోయినప్పటికీ.. మరో పదిహేనేళ్లపాటూ తన తండ్రి సీఎంగా ఉండాలని మాత్రం తాను కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి బయటపెట్టారు. అన్ని పార్టీల నుంచి తాము ప్రోత్సహిస్తన్న ఫిరాయింపుల్ని సహజంగానే తమ పాలన చూసి అందరూ వచ్చి చేరిపోతున్నట్లుగా అభివర్ణిస్తూ సమర్థించుకున్న కేటీఆర్‌.. సీఎం పీఠం రాబోయే పదిహేనేళ్ల పాటూ తండ్రిచేతినుంచి జారిపోకూడదని కోరుకోవడంలో విశేషం లేదని పలువురు భావిస్తున్నారు.

ఎందుకంటే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. దాదాపుగా ఆ స్థాయి అధికారం నెరపగల స్థాయిలో కేటీఆర్‌ ఉన్నారు. పేరుకు ముఖ్యమంత్రి పదవి తన చేతిలో లేదు గానీ.. తతిమ్మా అన్ని రకాలుగానూ ఆయన ఆ అధికారాన్ని అనుభవిస్తున్నారనే జనంలో ప్రచారం ఉంది. అలాంటి నేపథ్యంలో బాధ్యతలు నెత్తిన పడకుండా అధికారం మాత్రం ప్రాప్తిస్తోంటే ఎవరు మాత్రం ఆ పరిస్థితిని వద్దనుకుంటారు? అందుకే కేటీఆర్‌ బహుశా ఇలా సెలవిస్తుండవచ్చునని జనం అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close