రాబోతున్న మార్పుల్లో కేటీఆర్ అవకాశాల వేట..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా వేగంగా రంగంలోకి దిగారు. కరోనా ఎఫెక్ట్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని విషయాల్లోనూ మౌలికమైన మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో.. ఎవరూ ఊహించనన్ని మర్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా నుంచి అనేక సంస్థలు .. తమ కార్యకలాపాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలను ఆలోచిస్తే.. ఇది నిజంగా జరుగుతుందనే అంచనా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. కేటీఆర్ కూడా.. ఇదే అంచనాతో ఉన్నారు. శరవేగంగా ఓ బ్లూ ప్రింట్ ను రెడీ చేసుకున్నారు. వెంటనే అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులను వేరే దేశాలకు తరలిస్తున్నాయని, వాటిని అందుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉండాలని పరిశ్రమల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పని చేయాలన్నారు. సంక్షోభం వల్ల ఏఏ రంగాల్లో ఏలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతున్నాయో అధ్యయనం చేసి దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపైన విభాగాల వారీగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో కేటీఆర్‌కు ఓ విజన్ ఉంది. అమెరికాలో చదువుకుని ..ఎమ్మెన్సీల్లో పని చేసిన అనుభవం ఉండటంతో.. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆయన తనదైన పంధాను అవలంభిస్తున్నారు.

వైరస్ ప్రభావం తగ్గిన తరవాత… సురక్షిత దేశాల్లో పెట్టుబడుల ప్రవాహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనాను నమ్మడం అంత మంచిది కాదన్న భావన ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఇప్పుడే ప్రారంభమయింది. జపాన్ లాంటి దేశాలు.. చైనాలో ఉన్న తమ దేశాలకు చెందిన ఉత్పత్తి ప్లాంట్లను వీలైనంత త్వరగా తరలించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. బహిరంగంగా ప్రకటించకపోయినా పలు దేశాలు..సంస్థలు..అదే ఆలోచనలో ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో.. వారిని భారత్‌వైపు ఆకర్షిస్తే.. చైనాకు పోటీగా.. ఇండియా ఎదుగుతుందనడంతో సందేహం లేదు. కానీ ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే చొరవ కావాలి. ఆ చొరవను.. కేటీఆర్ చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close