క్రెడిట్‌ గేమ్‌లో బీజేపీ అతి తెలివి..! పరువు తీసేసిన కేటీఆర్..!!

తెలుగు రాష్ట్రాల్లో ఏ మంచి పని జరిగినా.. భారతీయ జనతా పార్టీ నేతలు.. తక్షణం.. అదంతా మోడీ మహిమేనని ప్రచారం మొదలు పెట్టేస్తారు. మొదటగా ట్వీట్ చేస్తారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. అవకాశం వచ్చినప్పుడు బహిరంగసభల్లో చెప్పుకుంటారు. వీరు ఆడే క్రెడిట్ గేమ్ ఎలా ఉంటుందంటే.. సహజంగా.. పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు వచ్చే సొమ్ములు కూడా.. ఊదారంగా.. మోడీ సొంత డబ్బులు ఇస్తున్నట్లు చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే దానికి బీజేపీనే కారణమని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రెడిట్‌ గేమ్‌లో తన అతి తెలివి తేటలను.. ట్విట్టర్‌లో బహిరంగ పరిచి పరువు పోగొట్టుకుంది.. భారతీయ జనతా పార్టీ. మంత్రి కేటీఆర్ ఆ పరువు తీసేశారంటే కరెక్ట్‌గా ఉంటుంది.

అసలేం జరిగిందంటే… సిరిసిల్లలో… ఓ కార్పొరేట్ సంస్థ సాయంతో..ఓ ప్రభుత్వ బడికి రైలు ఆకారంలో పెయింటింగ్‌తో పాటు ఇతర హంగులు సమకూర్చారు. “రైలుబడి” అనే ఓ జపాన్ పుస్తకం..చాలా మంది విద్యావేత్తలకు మార్గదర్శకం. ఈ స్ఫూర్తితో ఆ స్కూల్‌కి అలా రూపకల్పన చేశారు. పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలనుకున్నారు. ఇది సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌ను ఆకర్షించింది. తన ట్విట్టర్‌లో ఆ స్కూల్ ఫోటోలు పెట్టారు. సీఎస్ఆర్ నిధుల సాయంతో బడికి కొత్త రూపు వచ్చిందని.. సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి. దీని కింద కార్పొరేట్ సంస్థలు కచ్చితంగా రెండు శాతం ఆదాయాన్ని సమాజసేవకు ఖర్చు పెట్టాలి. ఈ కోటాలో ఓ సంస్థ ఈ స్కూల్‌కు ఆర్థిక సాయం చేసింది.

అయితే ఈ సీఎస్‌ఆర్‌… తెలంగాణ బీజీపేకి.. ఎస్‌సీఆర్‌ లా అర్థం అయింది. అంటే.. సౌత్ సెంట్రల్ రైల్వేలా కనిపించింది. పైగా రైలు బొమ్మలు రైల్వే వాళ్లే వేస్తారన్నంత తెలివి తేటల్నిచూపించారు. వెంటనే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోను డౌన్‌లోడ్ పెట్టేసుకుని… క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. ఈ ట్వీట్ కేటీఆర్ కంట పడింది. తలదించుకునేలా పంచ్ వేశారు. ప్రతీ దాన్ని తమ ఘనతేనని చెప్పుకోవడానికి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉందని… పంచ్ వేసి పరువు తీసేశారు. ఇది వైరల్ కావడంతో.. బీజేపీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసుకుంది. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. బీజేపీ ఇజ్జత్ సోషల్ మీడియాలో పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close