ఎన్టీఆర్ పేరు చెడగొట్టను..! ఈ మాటన్నది లోకేష్ కాదు..కేటీఆర్..!!

“మా తాత ఎన్టీఆర్, మా నాన్న చంద్రబాబులా పేరు తెచ్చుకుంటానో లేదో కానీ… వాళ్ల పేరు మాత్రం చెడగొట్టను”.. ఇదీ తనపై ఆరోపణలొచ్చినప్పుడల్లా నారా లోకేష్ చెప్పే మాట. కొంచెం అటూ..ఇటుగా ఇలాంటి మాటనే చెప్పారు. . తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. తారకరామారావు పేరు నిలబెట్టే పని చేస్తా కానీ చెడగొట్టే పని చేయనన్నారు. బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో… బీఎంటీ యూనిట్‌ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ కూడా.. నాన్న స్ఫూర్తితోనే కేసీఆర్ తన కుమారుడికి తారకరామారావు పేరు పెట్టారని చెప్పారు. దానికి తగ్గట్లుగా కేటీఆర్ తన ప్రసంగంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. తారక రామారావు పేరు నిలబెడతానన్నారు.

తెలంగాణ ఉద్యమం.. ఆ తర్వాత పరిణామాల్లో కేటీఆర్ పేరు చాలా సార్లు హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ సంబంధించిన జ్ఞాపకాలను.. హైదరాబాద్ లో తుడిచేసే ప్రయత్నాలను కేసీఆర్ చేశారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుని.. ఆ మహానుభావుడిపైనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాల్లో వివాదాలొస్తే ముందు కేటీఆర్ పేరును గుర్తు చేసి విమర్శలు చేసేవారు. కేటీఆర్ అసలు పేరు తారక రామారావు కాదని అజయ్ అని… అప్పట్లో ఎన్టీఆర్ దృష్టిలో పడేందుకు..టిక్కెట్ పొందేందుకు..తారక రామారావు అని మార్చారని.. రేవంత్ విమర్శలు చేసేవారు. దీనికి కౌంటర్ గా ఓ సారి కేటీఆర్ కూడా… తన పేరును.. ఎన్టీఆర్ స్ఫూర్తితో పెట్టలేదని చెప్పుకొచ్చారు కూడా.

కానీ ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయేమో కానీ… కేటీఆర్ కూడా..తనకు తారక రామారావు పేరు ఉండటాన్ని గర్వంగా ఫీవుతున్నారు. ఆయన పేరును నిలబెడతానంటున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి కార్యక్రమంలో .. బాలకృష్ణను కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ తన ఫేవరేట్ హీరో అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గురించి తన తల్లి ఎన్నో సార్లు చెప్పారని.. ఆస్పత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని అమ్మ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. నిజానికి కేసీఆర్ నివాసం… క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోనే ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా.. క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చి సాయం కోసం ఎంతో మంది తన ఇంటికి వచ్చేవారని.. వారికి సాయం చేసేవాడినని కూడా గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పేరు నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువ నేతలు తెలంగాణలో కేటీఆర్, ఏపీలో లోకేష్ సిద్ధమయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close