పార్టీలోకి వస్తామంటే వద్దంటామా: చేరికలను సమర్థించుకున్న కేటీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నేతల వలసలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సమర్థించుకున్నారు. రాజకీయపార్టీలలో చేరికలు సహజమని, ఎవరొచ్చినా తాము స్వాగతిస్తామని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రశ్నలడిగిన విలేకరులకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేశారు. ఆఫర్‌లు ఇచ్చి చేర్చుకుంటామన్న వార్తలను ఖండించారు. అవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలన్నారు. ఎవరైనా వచ్చి పార్టీలోకి చేరతామంటే వద్దంటామా అని విలేకరులను ప్రశ్నించారు. కేసీఆర్ బాగా చేస్తున్నాడనే ఉద్దేశ్యంతోనే చేరుతున్నట్లు చేరినవారే చెబుతున్నారని గుర్తు చేశారు. తమకు లేని బాధ మీకెందుకని మీడియాను ప్రశ్నించారు. ప్రలోభపెట్టటం వలనో, బెదిరించటం వలనో చేరటానికి – తమ పార్టీలో చేరేవారు చిన్నపిల్లలు కాదని అన్నారు. వారంతా దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారని, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా చేసినవారని చెప్పారు. ఎవరూ చేయని పనేదో తామే చేస్తున్నట్లు ఎందుకు చూస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close