“ఉద్యమ” పంచాయతీ పెట్టుకున్న కేటీఆర్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా… విధానపరంగా ఆ విమర్శలు ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ ఉద్యమం అంతా తమ క్రెడిటేనని ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ నేతలు ఉద్యమంలో ఎక్కడ ఉన్నారంటూ ఓ ట్వీట్ చేశారు. దీనికి సందర్భం.. సాగరహారం ఆందోళనకు పదేళ్లు పూర్తి కావడం ఇసుకేస్తే రానంత జనం మధ్య జరిగిన ఆ ఆందోళన ఓ చరిత్ర. అయితే దీన్ని కేటీఆర్ పూర్తిగా తమకే అన్వయించుకోవడంతోనే వివాదం ప్రారంభమయింది.

కేటీఆర్ ట్వీట్‌కు వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. సాగరహారం సక్సెస్ కావడానికి క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ తీసుకుంటోందని కానీ.. తెలంగాణ ఉద్యమం మొత్తం జేఏసీ ఆధ్వర్యంలో సకల జనులు చేశారని గుర్తు చేశారు. ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ ట్వీట్లు పెడుతున్న ఆయన.. ఇప్పుడు .. ప్రజలు ఉద్యమం చేస్తే ఆ ఫలాలను కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తోందని ఇప్పుడు ఉద్యమం క్రెడిట్ కూడా తమకే సొంతం అన్నట్లుగా చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో తాము చేసిన పోరాటాల్ని గుర్తు రేవంత్ గుర్తు చేశారు.

నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క జగ్గారెడ్డి తప్ప అందరూ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపారు. తమ పార్టీలు.. ఏపీలో ఇబ్బందికరం అవుతుందని తటపటాయిస్తున్నా.. తాము మాత్రం ఉద్యమంలోకి దిగారు. అందరూ పోరాడారు. ఆ పోరాటానికి కోదండరాం నేతృత్వంలోని జేఏసీ నాయకత్వం వహించింది. కానీ దాని వల్ల లాభం పొందింది మాత్రం టీఆర్ఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత జేఏసీ ఆచూకీ లేదు.. కానీ.. ఉద్యమం అంతా తామే నడిపామన్నట్లుగా టీఆర్ఎస్ మాత్రం జోరుగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తూంటాయి… కానీ ఇప్పుడు హవా టీఆర్ఎస్‌దే కాబట్టి వారి వాయిస్ ప్రజల్లోకి వెళ్లదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close